అటోమేటిగ్గా మెసేజ్ డిలీట్ అవుతుంది!

ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను యాడ్‌‌ చేసుకుంటూ వస్తున్న ‘వాట్సాప్’ త్వరలో మరిన్ని ఇంట్రెస్టింగ్‌‌ ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. కొన్ని ఫీచర్లను ప్రయోగాత్మకంగా ఇప్పటికే అమలు చేస్తున్నారు. ఇవి సక్సెస్‌‌ అయితే అందరికీ అందుబాటులోకి వస్తాయి. ప్రస్తుతం ‘వాట్సాప్‌‌’ టెస్ట్‌‌ చేస్తున్న ఫీచర్లలో ముఖ్యమైంది ‘సెల్ఫ్‌‌ డిస్ట్రక్టింగ్‌‌ ఫీచర్‌‌‌‌’. అంటే ఒక మెసేజ్‌‌ను ఎవరికి పంపినా అది ఒక టైమ్‌‌ తర్వాత ఆటోమేటిగ్గా డిలీట్‌‌ అయిపోతుంది. ముందుగానే సెండర్లు దీనికి టైమ్‌‌ సెట్‌‌ చేసి పెడితే చాలు. రిసీవ్‌‌ చేసుకున్న వాళ్లకు ఆ టైమ్‌‌ తర్వాత మెసేజ్‌‌ కనిపించదు. యూజర్లు ఆప్షనల్‌‌గా ఇది సెలెక్ట్‌‌ చేసుకోవచ్చు. అయితే మెసేజ్‌ ఆటోమేటిగ్గా డిలీట్‌ అయితే, ఆలోపు రిసీవర్లు మెసేజ్‌ చూడకపోతే ఎలా అనే సందేహాలున్నాయి. దీనిపై వాట్సాప్‌ ఏం చెబుతుందో చూడాలి. అలాగే రెండేళ్లక్రితం వచ్చిన ‘డిలీట్‌‌ ఫర్‌‌‌‌ ఎవ్రీవన్‌‌’ ఫీచర్‌‌‌‌ గురించి తెలిసిందే. ఎవరికైనా మెసేజ్‌‌ పంపిన తర్వాత, ఆ మెసేజ్‌‌పై క్లిక్‌‌ చేసి ‘డిలీట్‌‌ ఫర్‌‌‌‌ ఎవ్రీవన్‌‌’ సెలెక్ట్‌‌ చేసుకుంటే, అది గంటలోపు అందరికీ డిలీట్‌‌ అవుతుంది. అయితే మెసేజ్‌‌ డిలీట్‌‌ చేసిన ఎర్రర్‌‌‌‌ మాత్రం వాళ్లకు కనిపిస్తుంది. ‘సెల్ఫ్‌‌ డిస్ట్రక్టింగ్‌‌ ఫీచర్‌‌‌‌’ ఎనేబుల్‌‌ చేసుకుంటే ఈ ఎర్రర్‌‌‌‌ కూడా కనిపించదు.

 

Latest Updates