చైనా ఆక్రమిత భూమిని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారు?

కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందంటూ గురువారం విమర్శించిన కాంగ్రెస్ పార్టీ మరోమారు సర్కార్ పై విరుచుకుపడింది. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి చైనాతో ఉద్రిక్తతల సమస్యపై కేంద్రాన్ని టార్గెట్ చేసింది. చైనీయులు ఆక్రమించుకున్న మన భూభాగాన్ని తిరిగి ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారో చెప్పాలని ప్రశ్నించింది. ‘చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. సదరు భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయా? లేదా దాన్ని కూడా యాక్ట్ ఆఫ్ గాడ్ పేరుతో వదిలేస్తారా?’ అని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ లో భాగంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఎక్స్ టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్.జైశంకర్ భేటీ అయిన నేపథ్యంలో రాహుల్ ఈ ప్రశ్నలు సంధించారు. బార్డర్ లో ఉద్రిక్తతలు తగ్గించడంపై ఇరు నేతలు చర్చిస్తున్నారు.

Latest Updates