ఎన్‌ఆర్‌ఐ పాలసీ ఇంకెప్పుడు.?

ముంబయి.. దుబాయి.. బొగ్గుబాయి.. వలస బతుకులు.. కరువు కష్టాలు.. కన్నీటి యాతనలు. ఈ బాధలు పోవాలంటే మన రాష్ట్రం మనకు రావాలి’’.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్‌ అన్న మాటలివి. ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకొస్తామని 2014లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. కానీ రాష్ట్రం వచ్చి ఆరేళ్లుదాటినా పాలసీ పత్తాలేదు. సొంత రాష్ట్రంలోనూ వలసలు ఆగడంలేదు. గల్ఫ్‌ లో తెలంగాణ కార్మికులు మగ్గుతూనే ఉన్నారు. కరోనాతో ఇప్పుడు మరింత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా లక్షల మంది కార్మికులకు జీతాలు రావడంలేదు. దీంతో అక్కడ ఇరుక్కుపోయిన వారితోపాటు.. ఇక్కడ వారిపై ఆధారపడ్డ కుటుంబాలు కష్టాలు పడుతున్నా యి. ఏటా తెలంగాణకు రూ.1200 కోట్ల ఆదాయం వస్తున్నా, గల్ఫ్ కార్మికుల బాధలను సర్కారు పట్టిం చుకోలేదు.

 ఆరేళ్లు దాటుతున్నా..

ఎన్‌ఆర్‌ఐ పాలసీ వస్తే తమకు ఎంతో ఉపయోగ పడుతుందని గల్ఫ్‌ కార్మికులు ఆశపడ్డారు. ఎన్‌ఆర్‌ఐ పాలసీ తీసుకొస్తామని 2014లో మేనిఫెస్టోలో టీఆర్ఎస్ పెట్టింది. రాష్ట్రంలో మేనిఫెస్టోలో పెట్టని పాలసీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ ఎన్‌ఆర్‌ఐ పాలసీ మాత్రం పత్తాలేకుండా పోయిందని గల్ఫ్‌ కార్మికులు మండిపడుతున్నారు. అప్పటి ఎన్నారై మంత్రి కేటీఆర్‌ 2016 జూలై 27న హైదరాబాద్‌లో ఎన్ఆర్ఐ పాలసీపై సమావేశం నిర్వహించారు. ముసాయిదాను రూపొందించారు. కానీ తర్వాత దాన్ని పట్టించుకోలేదు. దీంతో వలసలు ఆగలేదు. ఏటా కొత్తగా వేల మంది గల్ఫ్‌ దేశాలకు వెళ్తూనే ఉన్నారు. ఇక్కడ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయకపోవడంతో చదువుకున్నవారు కూడా చిన్నచి న్న పనులకు గల్ఫ్‌ కు పోతున్నారు. ఇటీవల వలసలు పెరిగాయని కార్మికులు పేర్కొంటున్నారు. ప్రస్తుం గల్ఫ్‌ దేశాల్లో సుమారు 10 లక్షల మందికి పైగా తెలంగాణ కార్మికులు వివిధ పనులు చేస్తున్నారు.

కరోనాతో మరిన్ని కష్టాలు

మామూలుగానే గల్ఫ్‌ లో మన కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అరకొర జీతాలతోనే గడిపేవారు. చాలా మంది జైళ్లలో మగ్గుతున్నారు. అక్కడ చచ్చినా పట్టించుకోరు. 2014 తర్వాత గల్ఫ్‌ లో సుమారు 1,200 మంది వరకు చనిపోయినట్లు అక్కడి తెలంగాణ గల్ఫ్‌ కార్మిక సంఘాలు పేర్కొంటు న్నాయి. ఇక కరోనా తర్వాత అక్కడ మరింత దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉన్న ఉద్యోగాలు పోయాయి. అనేక మంది రోడ్లపై తిరుగుతున్నారు. బస్టాండ్‌ షెల్టర్లలోనే తలదాచుకుంటున్నారు. కరోనా సోకిన వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీంతో తమ కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక అనేక మందికి సోషల్‌ మీడియానే దిక్కు అయ్యింది. గతంలో అక్కడి నుంచి ఇక్కడి కుటుంబాలకు నెలనెలా డబ్బులు పంపించేవారు. ప్రస్తుం అక్కడ ఉన్న వాళకే  పూట గడవడం కష్టంగా మారింది. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.

ఏటా రూ.1,200 కోట్ల వరకు ఆదాయం

గల్ఫ్‌ దేశాలకు వెళ్లాలి  కార్మికుల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి మస్తు ఆదాయం సమకూరుతోంది. కార్మికులు సంపాదించిన డబ్బును తమ కుటుంబాలకు పంపుతున్నారు. ఇలా ఏటా రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యం వస్తోంది. కానీ తమ ద్వారా వచ్చే ఆదాయంలో కనీసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడంలేదని కార్మికులు వాపోతున్నారు. కేరళలో వలస కార్మికుల కోసం ప్రత్యేక చట్టం తీసుకొచ్చింది. బోర్డుఏర్పాటు చేసి, కార్మికుల సంక్షేమ కోసంఎంతో కృషి చేస్తోంది.

పాలసీ ప్రయోజనాలు ఇవీ..

  • గల్ఫ్‌ దేశాలకు వెళ్లే కార్మికులకు వీసా చార్జీలు, రిక్రూట్‌మెంట్‌ ఫీజులు తదితర ఖర్చుల కోసం పావలా వడ్డీ రుణాలు లభిస్తా యి.
  • తెలంగాణ స్టేట్‌ ఎన్నారై వెల్ఫేర్‌ ఫండ్‌ ఏర్పాటు అవుతుంది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందని పేద కార్మికులను ఆదుకోవడానికి ఎక్స్‌ గ్రేషియా చెల్లించడానికి ఈ నిధిని వినియోగిస్తారు.
  • విదేశీ జైళ్లలో మగ్గుతున్న ప్రవాసులకు న్యాయ సహాయం అందిస్తారు.
  • గల్ఫ్‌ దేశాల నుంచి ఇంటికి చేరిన వారికి పునరావాసానికి ప్రత్యేక పథకం రూపొందిస్తారు.కొత్తగా వ్యాపారాలు, చిన్న తరహా పరిశ్రమలు స్థా పించుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తారు.
  • గల్ఫ్‌ ప్రవాస కార్మికుల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ కి రుణాలు, గృహ నిర్మాణం కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలను అమలు చేస్తారు. 24 గంటల పాటు హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేస్తారు.

Latest Updates