పరిస్థితి అనుకూలిస్తేనే అమర్ నాథ్ యాత్ర

జమ్ముకాశ్మీర్ : అమర్ నాథ్ యాత్ర కొనసాగించటం పై ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేమని జమ్ముకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్మూ తెలిపారు. పరిస్థితి అనుకూలిస్తే యాత్ర కొనసాగించటంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అమర్ నాథ్ ట్రస్టీలతో లెఫ్ట్ నెంట్ గవర్నర్ సమావేశమయ్యారు. కరోనా కు సంబంధించి పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన తర్వాతే యాత్రపై ప్రకటన చేస్తామన్నారు. ఐతే అమర్ నాథ్ యాత్ర నిర్వహణకు వీలైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని చెప్పారు. ప్రస్తుతం జమ్ముకాశ్మీర్ లో 2 వేల మంది డాక్టర్లు, 30 వేల మంది భద్రత సిబ్బంది కరోనా నివారణకు కృషి చేస్తున్నారని దీంతో అమర్ నాథ్ యాత్రకు కావాల్సినంత భద్రత సిబ్బంది కొరత ఉంటుందన్నారు. సెక్యూరిటీ సహా అన్ని అంశాలు పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ గిరీశ్ చంద్ర ముర్మూ చెప్పారు.

Latest Updates