సబ్బుతో ఎప్పుడు కడగాలి.?..శానిటైజర్స్ ఎపుడు వాడాలి?

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వ్యక్తిగత దూరం, క్లీన్ గా ఉండడం,చుట్టున్న పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవడమే మందు. ఇంతకుమించి ప్రస్తుతం కరోనాకు మందు లేదనే చెప్పవచ్చు. అయితే చాలా వరకు చేతులు సబ్బుతో కడుక్కోవడం, శానిటైజర్స్ వాడాలని చెబుతున్నారు. అసలు సబ్బుతో ఎపుడు కడుక్కోవాలి,శానిటైజర్స్ ను ఎపుడు వాడాలనే సందేహాలు చాలామందికే ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

సబ్బుతో చేతులు ఎప్పుడు కడగాలి?

  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు
  • బాత్రూమ్ ఉపయోగించినా లేదా క్లీన్ చేసిన తర్వాత
  • ఆహారం తినడానికి లేదా వండుకునే ముందు, తర్వాత
  • అనారోగ్యంతో ఉన్న వ్యక్తి సంరక్షణలో ఉన్నప్పుడు
  • ఏదైనా జంతువును తాకిన తర్వాత
  • చెత్తను తాకినప్పుడు లేదా చేతులు మురికిగా కనిపించినప్పుడు

 

శానిటైజర్స్ ను ఎప్పుడు వాడాలి?

  • సబ్బు, నీరు అందుబాటులో లేనప్పుడు కనీసం
  • 60 శాతం ఆల్కహాల్‌ ఉండే శానిటైజర్ ను వాడండి.
  • బహిరంగ ప్రదేశాల్లో సబ్బు, నీరు అందుబాటులోలేనప్పుడు
  • హాస్పిటల్, నర్సింగ్ హోమ్ వంటి వాటిని విజిట్చేసే ముందు, తర్వాత

Latest Updates