రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి

కేంద్రంపై ఆరోపణలు చేస్తూ TRS సర్కారు పబ్బం గడుపుతోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌ రెడ్డి ఆరోపించారు. రైతు రుణమాఫీ ఎప్పుడో చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చే రుణాలపై 6 శాతం వడ్డీ రాయితీ ప్రకటించాలని, కందులు, పసుపుకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు. రైతుల కష్టాలు తీర్చితే…సీఎం కేసీఆర్ పుట్టినరోజును రైతుల దినోత్సవంగా జరుపుతామన్నారు జీవన్ రెడ్డి. రైతుల కోసం వచ్చే బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని, రైతులకు సహకార సంఘాలు రుణ సౌకర్యం కల్పించాలని కోరారు.

Latest Updates