లోక్ సభలో ఆమె ఎక్కడ…?

చట్ట సభల్లో 33 శాతం సీట్లను లేడీస్ కి రిజర్వ్​ చేయాలని అన్ని పొలి టికల్ పార్టీలూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి . దేశంలో టోటల్ గా 2,293 పొలి టికల్ పార్టీలు ఉండగా ఒకటీ రెండు పార్టీలు మినహా మిగతావి ఏవీ ఈ దిశగా ప్రయత్నంచేయట్లేదు. ఎన్నికల్లో పోటీకి సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళలకు ఛాన్స్​ ఇస్తే తప్ప ఈ డిమాండ్ నెరవేరటం కష్టం . ఇదే విషయాన్నితాజాగా బీజేపీ లీడర్ షైనా నొక్కిచెప్పారు. ఈసారి ఎక్కువ మంది స్త్రీలకు టికెట్లు ఇచ్చిన టీఎంసీ, బీజేడీ పార్టీలను ఆమె మెచ్చుకున్నారు. మిగతా పార్టీలూ ఈ బాటలోనే నడవాలని కోరారు. వరుసగా 8 సార్లు ఎంపీ అయిన సుమిత్రా మహాజన్ కి బీజేపీ బీఫాం​ ఇచ్చే సూచనలు లేకపోవటంతో ఆమె ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో పోటీచేయబోనని ప్రకటించారు. లోక్ సభ స్పీకర్ గా పనిచేసిన మహిళకే మళ్లీ టికెట్ ఇచ్చేందుకు ఇష్టపడని కమలదళం ఆమెకి బదులు మరో లేడీని రంగంలోకి దించుతుందో లేక మగవాళ్లకు ఛాన్స్​ ఇస్తుందో చూడాలి. పార్టీ పవర్ లోకి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేస్తామని​ రీసెంట్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రామిస్ చేసింది. స్త్రీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వటంలో హస్తం పార్టీ బీజేపీ కన్నా ఒక మెట్టు పైనే నిలిచింది. గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఇప్పటివరకు మొత్తం 344 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించగా అందులో 47 మంది ఆడవాళ్లు ఉన్నారు. కాం గ్రెస్ తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అధికార పార్టీ టోటల్ గా 374 మందితో లిస్టులను రిలీజ్ చేయగా వాటిలో లేడీస్ 45 మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీతో పోల్చితే కాషాయ పార్టీ స్త్రీలకు రెండు టికెట్లు తక్కువ ఇచ్చింది. 2014లో కాంగ్రెస్ మొత్తం 464 సెగ్మెంట్లలో పోటీ చేయగా అందులో 60 మంది ఉమెన్ క్యాండిడేట్లకు అవకాశం ఇచ్చింది. బీజేపీ 428 చోట్ల నిలబడగా అందులో లేడీస్ 38 మందే.

టీఎంసీ, బీజేడీ.. ముందడుగు……

ప్రస్తుతం 10 కన్నా ఎక్కువ మంది ఆడవాళ్లను లోక్ సభకు పంపించనున్న పార్టీల లిస్టులో పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాం గ్రెస్(టీఎంసీ), ఒడిశాలోని బిజూ జనతా దళ్(బీజేడీ) మాత్రమే ఉన్నాయి .టీఎంసీ 42 సీట్లలో 17 స్థానాలను (41 శాతం), బీజేడీ 19 నియోజకవర్గాల్లో ఏడింటిని (36.8శాతం) మహిళలకు కేటాయించింది. కాంగ్రెస్ 47 మంది, బీజేపీ 45 మంది మహిళలకు టికెట్లు ఇచ్చినా ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న మగ వాళ్లతో పోల్చితే ఆడవాళ్ల సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.

తొలి దశలో 8 శాతం లోపే…

మన దేశంలో ఇప్పటికీ పురుషులే రాజ్యమేలుతున్నారనటానికి లోక్ సభ తొలి విడత ఎన్నికలే ఉదాహరణ. ఎందుకంటే ఈ నెల 11న వివిధ రాష్ట్రాల్లో ని 91 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగ్గా మొత్తం 1271 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇందులో ఆడవాళ్లు 89 మంది మాత్రమే (8 శాతం కన్నా తక్కువే) ఉన్నా రు.

ప్రపంచంలో 149వ స్థానం...

పార్లమెంట్ లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి ఇండియా ప్రపంచంలోని 193 దేశాల్లో 149వ స్థానంలో నిలిచిం ది. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ (97), పాకిస్థాన్ (101), ఆడవాళ్లకు కట్టుబాట్లు ఎక్కువ ఉండే సంప్రదాయ సౌదీ అరేబియా(106) కూడా మన దేశం కన్నా మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోవటం గమనార్హం. ఆసియా ఖండంలోని కీలకమైన 8 దేశాలతో పోల్చితే ఇండియా కిం ది నుం చి రెండో మెట్టు మీద(పై నుం చి ఏడో మెట్టు వద్ద) ఉండిపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికలతో పోల్చితే 2014 సాధారణ ఎన్నికల్లో దేశవ్యా ప్తంగా బరిలో నిలి చిన మహిళా అభ్యర్థుల సంఖ్య 20 శాతం పెరిగింది. ప్రస్తుతం ఈ నంబర్ పెరుగుతుందా , తగ్గుతుందా అనేదానిపై క్లారిటీ లేదు. ఇప్పటికి ఒక విడత పోలింగ్ మాత్రమే ముగిసింది. ఇంకా ఆరు దఫాలు ఓట్లు జరగాల్సిఉంది. చాలా చోట్ల క్యాండిడేట్లను ఫైనల్ చేయాల్సి ఉంది. కాబట్టి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీచేస్తున్న మొత్తం ఆడవాళ్ల సంఖ్య తేలటాని కి మరింత సమయం పడుతుంది.

‑ ‘ది వైర్ ’ సౌజన్యంతో..

Latest Updates