సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ ఆలయం ఎక్కడ?

  • జులై 6న టెంపుల్ను కూల్చేసిన ప్రభుత్వం
  • అప్పట్నుంచి కనిపించలే
  • పరిసరాల్లోని గుళ్లలో వెతికిన ఎంప్లాయీస్, పండితులు
  • ఎక్కడ ఉంచారో చెప్పాలని డిమాండ్
  • శాస్త్రో క్తంగా రోజూ అమ్మవారికి పూజలు చేస్తున్నరా?
  • చేయకపోతే అరిష్టమే అంటున్న పండితులు

సెక్రటేరియట్లోని నల్లపోచమ్మ విగ్రహాన్ని ఎక్కడ దాచారన్న దానిపై అనుమానాలు వక్తమవుతున్నాయి. అమ్మవారికి రోజూ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే.. టెంపుల్  కూల్చేసి నెల దాటిపోతోంది. అప్పటి నుంచి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ ఉంచారు? నిత్య పూజలు నిర్వహిస్తున్నారా? అనే దానిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంత రహస్యం ఎందుకని ఇటు సెక్రటేరియట్ ఎంప్లాయీస్,అటు పండితులుప్రశ్నిస్తున్నారు. విగ్రహాన్నిమళ్లీ ప్రతిష్టించే వరకు శాస్త్రోక్తంగా నిత్యం పూజలు చేయకపోతే అరిష్టమని పండితులు హెచ్చరిస్తున్నారు.
కొత్త సెక్రటేరియట్ నిర్మాణం కోసం గత నెల 6న అరరాత్రి పాత సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చి వేత పనులు స్టార్టయ్యాయి. అదే రోజు అక్కడి నల్లపోచమ్మ టెంపుల్, మసీద్లను కూల్చి వేశారు. దీనిపై విమర్శలు రావడంతో ఐదురోజులు ఆలస్యంగా స్పందించిన ప్రభుత్వం.. భారీ బిల్డిం గ్స్కూల్చి వేస్తుండగా కొన్ని శిథిలాలు పడి నల్లపోచమ్మ టెంపుల్ కొద్దిగా ధ్వంసమైందని ప్రకటించింది. నల్లపోచమ్మ టెంపుల్ను కూల్చేముందు అక్కడి పూజారులనుకూడా సంప్రదించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. విగ్రహం కదిలించే ముందు జరపాల్సిన పూజాది కార్యక్రమాలు నిర్వహించారో లేదోనని పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కనీసం నాలుగైదు గంటలు ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. అయితే గజ్వేల్ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన పూజారులతో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది.

పరిసరాల్లోని ఏ గుడిలోనూ లేదు

నల్లపోచమ్మ విగ్రహాన్ని సెక్రటేరియట్నుంచి తరిలించారా..? తరలిస్తే ఎక్కడ ఉంచారు? అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. కొందరు ఎంప్లాయీస్, పండితులు సెక్రటేరియట్ పరిసరాల్లో ని ఇతర టెంపుల్స్లో పరిశీలించారు. ‘‘సెక్రటేరియట్ నుంచి అమ్మవారి విగ్రహం తరలించారు. విగ్రహం కోసం రెండు మూడు కిలో మీటర్లపరిధిలోని అన్ని టెంపుల్స్ ను పరిశీలించాం . తమ ఆలయాల్లోకి విగ్రహాన్ని తీసుకురాలేదని అక్కడివాళ్లు చెప్పారు. విగ్రహాన్ని తరిలిస్తే ఆ విషయాన్ని బహిర్గతం చేయాలి”అని ఎంప్లాయీస్, పండితులు డిమాండ్చేస్తున్నారు.

శాస్త్ర ప్రకారం పూజలు చేయకపోతే అరిష్టమే

విగ్రహం తరలింపు నుంచి మళ్లీ ప్రతిష్టించే వరకు శాస్త్రప్రకారం పూజలు నిర్వహించకపోతే అరిష్టమని పండితులు హెచ్చరిస్తున్నారు. విగ్రహాన్ని ఎక్కడ ఉంచినా నిత్య పూజలు నిర్వహించాలంటున్నారు. ‘‘అమ్మవారి విగ్రహం అక్కడ్నించి కదిలించే ముందు ప్రత్యేక పూజలు చేయాలి. విగ్రహం పక్కనే ఓ కలశంలో నీళ్లునిం పాలి. దాని చుట్టూ దారంతో కలశారోహణం చేయాలి. అలా చేయడం వల్ల కలశంలోకి అమ్మవారి శక్తులు ప్రసరిస్తాయి. ఆ కలశానికి నిత్య పూజలు జరపాలి. విగ్రహాన్ని మళ్లీ ప్రతిష్టించే టైమ్‌లో కలశంలోని నీళ్లను అమ్మవారికి సంప్రోక్షణ చేయాలి’’ అని నల్లపోచమ్మ టెంపుల్ లో పూజలు చేసిన పండితులు చెప్తున్నారు. కలశం లేకుండా అమ్మవారి విగ్రహాన్ని భద్రపరిస్తే శాస్త్రరీత్యా పెద్ద తప్పిదంఅవుతోందని అంటున్నారు. నల్లపోచమ్మ విగ్రహాన్నిఎక్కడ ఉంచారో ప్రభుత్వంప్రకటన చేయాలని, శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతున్నాయా లేదా క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు.

పిలిచి అన్నం పెడితె..కెలికి కయ్యమా..ఏపీ సర్కారుపై సీఎం ఫైర్

 

Latest Updates