ఏ రాష్ట్రం కేసు ఆ రాష్ట్రానికే: హైకోర్టు

  • ఉమ్మడి హైకోర్టులో ఉన్న ధిక్కార,అప్పీల్,రివ్యూ పిటిషన్లపై స్పష్టత

ఉమ్మడి హైకోర్టులో దాఖలైన కేసుల్లో .. ఏ రాష్ట్రానికి చెందిన కేసు ను ఆ రాష్ట్రమే విచారించుకోవాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం దీనిపై రాష్ట్ర హైకోర్టు స్పష్ట తనిచ్చింది. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 40(3) ప్రకారం.. ఉమ్మడి హైకోర్టు ఏర్పడే నాటికి దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్లు/అప్పీ ళ్లు/పున:సమీక్ష పిటిషన్ల విచారణ అధికారం ఉమ్మడి హైకోర్టుకు మాత్రమే ఉంటుందని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు లేఖ రాశారు. ఆ లేఖనే రాష్ట్ర హైకోర్టు సుమోటోగా తీసుకుంది. ప్రజాహిత వ్యాజ్యం గా పరిగణించి విచారిం చింది. ఆయా అప్పీళ్లు, ఇతర సంబంధిత వ్యాజ్యాల్లలో ని అంశం ఏ రాష్ట్రానికి చెందినదైతే ఆయా రాష్ట్రాల హైకోర్టులకు బలాయించాలి. ఇదే తరహాలో రిట్‌‌ అప్పీళ్లు, రివ్యూ పిటిషన్లు, కోర్టు ధిక్కార వ్యాజ్యాలనూ సంబంధిత హైకోర్టులకు బదిలీ చేయాలి. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రీ చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ టీబీఎన్‌‌ రాధాకృష్ణన్, జస్టిస్‌‌ పీవీ సంజయ్‌ కుమార్ , జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డిలతో కూడిన ఫుల్ బెంచ్ తీర్పునిచ్చింది. తొలుత ఆ లేఖను ఇద్దరు జడ్జిల హైకోర్టు ధర్మాసనం సుమోటోగా తీసుకుని విచారిం చింది. అయితే అందులో న్యాయపరమైన అంశాలు ఉన్నందు న ఫుల్ బెంచ్ గతంలోనే విచారించి తీర్పును వాయిదా వేసింది. తాజాగా తీర్పునిచ్చింది.

Latest Updates