ఎలాంటి శానిటైజర్స్‌ వాడాలి? అసలు ఏం చూడాలి?

ఎఫ్‌‌డీఏ పలు సూచనలు

వాషింగ్టన్: కరోనా వైరస్‌‌ భయానికి హ్యాండ్ శానిటైజర్స్ వాడకం మస్తు పెరిగిపోయింది. అయితే శానిటైజర్స్ కొనేటప్పుడు ఏం చూడాలి..? ఎలాంటి శానిటైజర్స్‌‌ను కొనుక్కోవాలి అనే విషయాలపై అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు సూచనలు చేసింది. హ్యాండ్ శానిటైజర్స్‌‌లో 60 శాతం ఇథైల్‌ ఆల్కహాల్ లేదా 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉండాలని చెప్పింది. ఇతర ఆమోదిత ఇంగ్రిడియెంట్స్‌‌లో స్టెరైల్ డిస్టిల్డ్ వాటర్, హైడ్రోజన్ పెరోక్సైడ్, గ్లిసరిన్ ఉండొచ్చని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది. మిథనాల్ లేదా 1 ప్రోపనాల్,  లేదా రెండు కలిసి ఉన్న శానిటైజర్లను వాడకూడదని సూచించింది. ప్యాకేజ్డ్ ఫుడ్, డ్రింక్ కంటైనర్లలో ప్యాక్ చేసిన హ్యాండ్ శానిటైజర్ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎఫ్‌‌డీఏ హెచ్చరించింది. వాటివల్ల ప్రమాదం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఆల్కహాల్ కాకుండా బెంజల్కోనియం క్లోరైడ్ ఉన్న హ్యాండ్ శానిటైజర్లను కూడా వాడకూడదని పేర్కొంది. ఈ శానిటైజర్లు బ్యాక్టీరియాను, వైరస్‌‌ను చంపడంలో చాలా తక్కువ పనిచేస్తాయని చెప్పింది. సొంతంగా శానిటైజర్లు తయారు చేసుకోవడం కూడా ప్రమాదకరమని ఎఫ్‌‌డీఏ హెచ్చరిస్తోంది. తప్పుడుగా కెమికల్స్‌‌ను మిక్స్ చేస్తే.. చేతులు కాలే ప్రమాదముందని తెలిపింది. సోపు లేదా వాటర్‌‌‌‌తో చేతులు కడుక్కోలేని పక్షంలోనే హ్యాండ్ శానిటైజర్లను వాడాలని కొలంబియా యూనివర్సిటీ ఇన్‌‌ఫెక్షన్ డిసీజ్ రీసెర్చర్ బరున్ మాథేమా అన్నారు. హ్యాండ్ వాషింగే ఎక్కువ క్రిములను తొలగిస్తుందని తెలిపారు.

For More News..

పోటీపడి మరీ రేట్లు తగ్గిస్తున్న ఎయిర్‌టెల్-జియో బ్రాడ్ బ్యాండ్స్

ఓ వైపు ప్రాక్టీస్‌ మరోవైపు రిఫ్రెష్‌ మెంట్‌

వందో విజయం సాధించిన సెరెనా

తెలంగాణలో మరో 2,479 కరోనా కేసులు.. 10 మంది మృతి

Latest Updates