ప్యారాసైట్ చూస్తే నిద్రొచ్చేసింది: రాజమౌళి

ట్విట్టర్ లో దర్శక ధీరుడిపై ట్రోల్స్
హైదరాబాద్: బాహుబలి సిరీస్ తో వరల్డ్ వైడ్ గా గుర్తింపు సంపాదించిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళిపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ప్యారాసైట్ గురించి రాజమౌళి తన అభిప్రాయాలను చెప్పాడు. ‘బోంగ్ జూ హూ తెరకెక్కించిన ప్యారాసైట్ చూశాను. ఎందుకో ఆ సినిమా అంతగా నచ్చలేదు. ఫిల్మ్ చాలా నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించింది. రాత్రి 10 గంటలకు సినిమా చూడటం మొదలుపెట్టా. ఫిల్మ్​సగం అయిపోయాక చూడటం ఆపేసి పడుకున్నా’ అని రాజమౌళి ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఆయన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఏ సినిమాను అయినా మొత్తం చూశాకే కామెంట్ చేయాలని దర్శక ధీరుడిపై నెటిజన్స్ విమర్శలు సంధిస్తున్నారు. మూవీ అంటే లీడ్ యాక్టర్ ను అవాస్తవ దృశ్యాలతో హైలైట్ చేయడమేనని రాజమౌళి భావిస్తున్నారని.. మాస్ మసాలా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన నుంచి హీరోను పూజించే సినిమాలు తప్ప ఇంకేం ఆశించగలమని ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఆస్కార్ పురస్కారాల వేడుకలో సౌత్ కొరియా మూవీ పారాసైట్ కు గాను డైరెక్టర్ బోంగ్ జూ ఉత్తమ దర్శకుడిగా నిలిచి హిస్టరీ క్రియేట్ చేశాడు. దీంతోపాటు బెస్ట్ పిక్చర్, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డులను సైతం ప్యారాసైట్ తన ఖాతాలో వేసుకుంది.

Latest Updates