బీజింగ్‌‌తో డీల్స్ ఉన్న ఫిన్‌‌టెక్ కంపెనీలపై కొరడా


ఈడీ, సీఐడీలు విచారణ ప్రారంభం

పేమెంట్స్ జరపొద్దని పేటీఎం, రేజర్‌‌‌‌పేలకు ఆదేశం

300-400 యాప్స్‌‌ బ్యాన్ చేసిన రేజర్‌‌‌‌పే

న్యూఢిల్లీ: బీజింగ్ కంపెనీలతో డీలింగ్స్ ఉన్న ఫిన్‌‌టెక్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. చైనా ఫండ్స్‌‌తో ఇండియాలో వ్యాపారాలు నిర్వహిస్తోన్న స్నాప్‌‌ఐటీ లోన్, బబుల్ లోన్, గో క్యాష్, ఫ్లిప్‌‌ క్యాష్ వంటి 24 కంపెనీలకు వ్యతిరేకంగా ఈడీ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌‌మెంట్లు(సీఐడీ)లు విచారణలు ప్రారంభిస్తున్నాయి. వారి ట్రాన్సాక్షన్లు, పేమెంట్లు జరుగకుండా ఈడీ, సీఐడీలు ఆపివేస్తున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక వీటి పేమెంట్ గేట్‌‌వేలు రేజర్‌‌‌‌పే, పేటీఎంలకు కూడా ఈడీ, సీఐడీ యూనిట్లు లేఖ రాశాయి. బీజింగ్ కంపెనీలతో డీలింగ్స్‌‌ను ఆపివేయాలని సీరియస్‌‌గా హెచ్చరించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ‘ఈడీ, పలు రాష్ట్రాల సీఐడీలు పేమెంట్ గేట్‌‌వేలకు నోటీసులు పంపాయి. చైనీస్‌‌ నిర్వహించే ఫిన్‌‌టెక్ సంస్థల అకౌంట్లతో ఉన్న డీలింగ్స్‌‌ను క్యాన్సిల్ చేసుకోవాలని ఈ నోటీసుల్లో ఆదేశించాయి’ అని ఈ విషయం తెలిసిన అధికారులు తెలిపారు. క్యాష్ ఫ్లోలను జనరేట్ చేయడం కోసం పేమెంట్ గేట్‌‌వేలు ఈ చైనీస్ సంస్థలకు అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాయి. కానీ వీరి నౌ యువర్ కస్టమర్(కేవైసీ)ని చెక్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  ఈ విషయంపై స్పందించేందుకు పేటీఎం నిరాకరించగా.. రేజర్‌‌‌‌పే మాత్రం గత కొన్ని నెలలుగా ఈ యాప్స్‌‌లో కొన్నింటిని బ్యాన్ చేసినట్టు వెల్లడించింది.

ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యాపారాలుగా తాము ఎవరైనా అనుమానిత మర్చెంట్లుగా అనిపిస్తే చట్టపరమైన అధికారులకు సమాచారం అందిస్తామని రేజర్‌‌‌‌పే అధికార ప్రతినిధి చెప్పారు. లా ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌లో సాయం చేసేందుకు వారికి కేవైసీ, ఇతర వివరాలను అందిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో రేజర్‌‌‌‌పేకి వ్యతిరేకంగా ఎలాంటి యాక్షన్ లేదా ఇన్వెస్టిగేషన్‌‌ను చేపట్టలేదని స్పష్టం చేసింది. గత మూడు నెలలుగా రేజర్‌‌‌‌పే 300 నుంచి 400 వరకు యాప్స్‌‌ను బ్యాన్ చేసినట్టు వెల్లడించింది. 95 శాతం మనీ లెండింగ్ యాప్స్ తమ పేమెంట్ గేట్‌‌వేగా బెంగళూరుకు చెందిన ఫిన్‌‌టెక్‌‌ రేజర్‌‌‌‌పే వాడుతున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల పోలీసు డిపార్ట్‌‌మెంట్లకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా చైనీస్ అప్లికేషన్లను లిస్ట్ చేశామని అధికారులు చెప్పారు. వీటిపై ఈడీ మనీ లాండరింగ్ ఆరోపణల కింద ఇన్వెస్టిగేషన్ చేపడుతుందని పేర్కొన్నారు. 95 శాతానికి పైగా లావాదేవీలు సింగిల్ గేట్‌‌వే ద్వారానే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌కి కోటి ఫైన్

V6 రేటింగ్​పై కుట్ర.. రేటింగ్​ పెరగకుండా ప్రయత్నాలు

హోం ట్యూషన్లకు ఫుల్ డిమాండ్​.. నెలకు రూ. 3 నుంచి 15 వేలు

ఉద్యోగాల ఖాళీలు అర లక్ష.. సమస్యలు సవాలక్ష

Latest Updates