ఇండియాకు వైట్‌-వెస్టింగ్‌ హౌస్

హైదరాబాద్‌‌, వెలుగు: అమెరికా కన్జూమర్ అప్లయెన్సెస్‌‌ బ్రాండ్‌‌ వైట్‌ –వెస్టిం గ్‌ హౌస్‌‌ ఇండియా మార్కెట్లోకి వచ్చింది. ఆన్‌ లైన్ షాపింగ్ మార్కె ట్‌ ప్లేస్ అమెజాన్ ద్వారా సెమీ ఆటోమేటిక్‌‌ వాషింగ్‌ మెషీన్లను కూడా విడుదల చేసింది. నోయిడాకు చెందిన సూపర్‌‌ ప్లాస్ట్రాని క్స్‌‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌‌ (ఎస్‌‌పీపీఎల్‌‌) వీటిని తయారు చేస్తుంది. రెండు కంపెనీలు కలిసి రూ.మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. 7 కేజీలు, 8 కేజీలు, 9 కేజీల విభాగాలలో వాషింగ్‌ మెషీన్లను అమెజాన్‌ ద్వారా అమ్ముతారు. వీటి రేట్లు రూ. 7,499 నుంచి మొదలవుతాయి. త్వరలో నోయిడాలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ప్లాస్ట్రానిక్స్ ప్రకటించింది.

Latest Updates