భారత్ లో కరోనా అదుపులో ఉంది : మోడీజీ ప్రపంచానికి మీ సేవలు అనిర్వచనీయం

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌.., ప్రధాని మోడీ ని ప్రశంసించారు. ప్రపంచదేశాలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ ను అందించేందుకు ఇండియా ప్రయత్నిస్తుందని కొనియాడారు.

ఐక్యరాజ్యసమితి సర్వసభ్య 75వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ ఇండియా తరుపున ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తున కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసి, వాటిని ప్రపంచ దేశాలకు అందించే దిశగా ప్రపంచ దేశాలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు.

వ్యాక్సిన్ తయారీ, ప్రపంచ దేశాలకు ఉత్పత్తి చేసే సామర్ధ్యం ఉందని స్పష్టం చేశారు. అంతేకాదు కరోనా కష్టకాలంలో 150దేశాలకు నిత్యవసర మెడిసిన్ ను అందించినట్లు వెల్లడించారు.

ప్రధాని వ్యాఖ్యలపై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్ గెబ్రెయేసస్‌ ధన్యవాదాలు తెలిపారు. వ్యాక్సిన్ తయారీలో కూడా భారత్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో అంతర్జాతీయ వేదికపై భారత ప్రధాని మోడీ ఇచ్చిన హామీని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ కొనియాడారు. భారత్‌లో 500 కేసులు ఉన్నప్పుడే మోడీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుందని.. అందుకే అక్కడ వైరస్ అదుపులో ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అన్నారు.

Latest Updates