ఐబ్యూప్రొఫెన్ వద్దు.. పారాసిటమాల్ వాడండి

ఫ్రెంచ్ మినిస్టర్ సలహాను సమర్థించిన WHO 

కరోనా పేషెంట్లు, అనుమానితులు ఐబ్యూప్రొఫెన్ డ్రగ్ ను తీసుకోవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
( డబ్ల్యూహెచ్ఓ) చెప్పింది. దానికి బదులు పారాసిటమాల్ ట్యాబ్లెట్లను వినియోగించాలని సూచించింది. కరోనా లక్షణాలున్న వారు  ఫీవర్, పెయిన్స్ నుంచి రిలీఫ్​కోసం ఎక్కువగా ఐబ్యూప్రొఫెన్ డ్రగ్ ను వాడుతున్నారని, ఇది కరోనా వైరస్ ను మరింత ప్రమాదకరంగా మారుస్తుందని ఫ్రాన్స్ హెల్త్ మినిస్టర్ ఒలివర్ వెరన్ ఇటీవల హెచ్చరించారు. ఐబ్యూప్రొఫెన్ కు బదులు పారాసిటమాల్ ను వాడాలని ఆయన సూచించారు. దీనిపై పెద్ద చర్చ నడవడంతో  డబ్ల్యూహెచ్ఓ క్లారిటీ ఇచ్చింది.

వెరన్ సూచనను సమర్థించింది. కరోనా ట్రీట్ మెంట్ లో పారాసిటమాల్ వినియోగించడంపై త్వరలోనే గైడ్ లైన్స్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ‘‘కరోనా నివారణకు సొంతంగా మెడిసిన్స్ వాడుతున్నవారు ఇబుప్రొఫెన్ కు బదులు పారాసిటమాల్ వినియోగించాలని రికమండ్ చేస్తున్నాం” అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి తెలిపారు. ఐబ్యూప్రొఫెన్ డ్రగ్ కరోనాను మరింత బలోపేతం చేస్తుందని లాన్సెట్ మెడికల్ జర్నల్ లో ప్రచురితమైన స్టడీలో వెల్లడైంది. దీన్ని పేర్కొంటూనే ఫ్రెంచ్ మినిస్టర్ వెరన్ పారాసిటమాల్ వినియోగించాలన్నారు. ఇప్పటికే ఎవరైనా ఇబుప్రొఫెన్ డ్రగ్ తీసుకొని ఉంటే డాక్టర్ సంప్రదించాలని సూచించారు.

భారీగా పెరిగిన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు

కరోనా ఎఫెక్ట్‌‌తో సెబీ రూల్స్‌‌ మార్చింది

Dr Margaret Chan, WHO Director-General addresses during the 67th World Health Assembly, Palais des Nations, Geneva. Monday 19 May 2014. Photo by Violaine Martin

Latest Updates