రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరగడమే కాదు..మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది : డబ్ల్యూ హెచ్ ఓ

రాయిటర్స్ కథనం ప్రకారం రాబోయే రోజుల్లో కరోనా కేసులు పెరుగుతాయని, మరో వారంలో కరోనా కేసులు 10మిలియన్ మార్క్ ను దాటబోతున్నట్లు డబ్ల్యూ హెచ్ ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కరోనా వైరస్ కేసుల్ని నియంత్రించేందుకు ఈ ఏడాది  హజ్ యాత్రను రద్దు చేసేలా సౌదీ యంత్రాంగం నిర్ణయించింది. సౌదీ నిర్ణయానికి టెడ్రోస్ మద్దుతు పలికారు. ఈ సందర్భంగా టెడ్రోస్ మాట్లాడుతూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు అన్నీ దేశాలకు డబ్ల్యూహెచ్ ఓ మద్దతు ఉంటుందన్నారు.

మరోవైపు  డబ్ల్యూహెచ్ ఓ సభ్యుడు డాక్టర్ మైక్ ర్యాన్ మాట్లాడుతూ కరోనా వైరస్ తీవ్రత తగ్గలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చబోతుందన్నారు.  పరిస్థితులు అదుపులోకి రాలేదని రాబోయే రోజుల్లో కరోనా కేసులతో పాటు ..వైరస్ సోకిన బాధితులు ఎక్కువ మంది మరణించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

కొన్ని దేశాలు లాక్ డౌన్ నుంచి రిలాక్స్ అవుతున్నాయని ఇది ఆరంభం మాత్రమే..సాధారణ స్థితికి రావాలంటే మరింత సమయం పడుతుందని అప్పటి వరకు ప్రతీ ఒక్కరు కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ ఓ జనరల్ డైరెక్టర్  డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ సూచించారు.

 

Latest Updates