హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్రయల్స్‌ నిలిపేసిన డబ్ల్యూహెచ్‌వో

జెనీవా: కరోనా పేషంట్ల ట్రీట్‌మెంట్‌కు ఉపయోగిస్తున్న యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోర్వోకిన్‌ ట్యాబ్లెట్స్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ట్రయల్స్‌ను నిలిపేసింది. ఆ డ్రగ్‌ కరోనాను పూర్తిగా నయం చేయడంలో విఫలమైందని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు లోపినవిర్‌‌, రిటోనవిర్‌‌ డ్రగ్స్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను కూడా ఆపేసినట్లు సంస్థల వెల్లడించింది. ఈ డ్రగ్స్‌ మరణాలు తగ్గించడంలో ఎలాంటి ప్రభావం చూపలేదని చెప్పింది.

Latest Updates