కవలలకు జన్మనిచ్చిన కరోనా పేషెంట్

‌హైదరాబాద్ : ‌గాంధీ హాస్పిటల్‌‌లో మరో కరోనా పేషెంట్‌‌ ప్రసవించింది. 20 ఏండ్ల ఆ మహిళకు మంగళవారం కవలలు పుట్టారు. ఇద్దరు అమ్మాయిలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. రెండ్రోజుల క్రితం డెలివరీ కోసం ఆమె నీలోఫర్ హాస్పిటల్‌‌లో చేరారు. మేడ్చల్‌‌లో ఆమె ఉంటున్న ఏరియా కంటైన్‌‌మెంట్ జోన్ కావడంతో, లక్షణాలు లేకపోయినా
టెస్టులు చేయించారు. పాజిటివ్ రావడంతో గాంధీకి తరలించారు. అసోసియేట్ ప్రొఫెసర్‌ రేణుక నేతృత్వంలోని డాక్టర్ల బృందం
మంగళవారం ఆమెకు సిజేరియన్ చేశారు. పిల్లలిద్దరికీ టెస్టులు చేయిస్తున్నామన్నారు.

For More News..

నచ్చిన కోర్సులో సీటు రాక.. ఇష్టంలేని కోర్సు చదవలేక..

భూములు పాయే..  ప్రాజెక్టు పాయే.. కొలువులు రాకపాయే..

రూ. 170 కోసం దోస్తుల గొడవ.. ఒకరి మృతి

Latest Updates