సతీష్ బాబును చంపిందెవరు?

కేపిహెచ్​బీ, వెలుగు :కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో సంచలనం రేపిన సాఫ్ట్​వేర్​కంపెనీ ఓనర్ సతీష్ బాబు(35) హత్య కేసు అనేక అనుమానాలకు తావిస్తుంది. సతీశ్​బాబు చిన్నప్పటి ఫ్రెండ్, కంపెనీ పార్టనర్ హేమంత్ కి మధ్య వచ్చి ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమై ఉండొచ్చనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి కంపెనీలో పనిచేసే ఓ యువతి వల్ల ఇద్దరి మధ్య జరిగిన గొడవలు హత్యకు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు  ఆ యువతిని అదుపులోకి తీసుకొని  పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఈ నెల 28న హేమంత్ ఇంటిలో సతీష్​బాబు దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి హేమంత్ కనిపించడం లేదు. సతీష్​బాబును హత్య చేసింది  హేమంత్​లేదా మరేవరైనా ఉన్నారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  తన స్నేహితుడైన సతీష్​బాబును  హేమంత్​ ఎందుకు హత్య చేశాడు, హత్య చేయడానికి గల బలమైన కారణాలు ఏంటి, ఇద్దరి మధ్య కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలా, లేక ఇద్దరి మధ్య ఉన్న యువతి స్నేహం కారణమా అని పోలీసులు విచారణ చేస్తున్నారు.

సతీష్​బాబు, హేమంత్​లకు కామన్​ ఫ్రెండ్​ అయినా  కంపెనీలో పనిచేసే ఓ యువతి  సతీష్​బాబుతో సన్నిహితంగా ఉండడం, దీంతో హేమంత్ సతీష్​బాబుపై కక్ష పెంచుకొని వారిద్దరి ఫోటోలు తీసి బ్లాక్​మెయిలింగ్​కు పాల్పడ్డట్లు సమాచారం. యువతి కారణంగానే ఇద్దరి మధ్య గొడవలు తలెత్తి  సతీష్​ బాబు హత్యకు దారి తీసి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రస్తుతం ఆ యువతిని   పోలీసులు అదుపులోకి తీసుకొని రెండు రోజులుగా విచారిస్తున్నారు. సతీష్​ బాబు హత్యకు ప్రధాన కారణం ఆర్ధిక లావాదేవీలే కారణమని యువతి తన వాగ్మూలంగా పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న హేమంత్​ కోసం రెండు పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Latest Updates