శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలో హెడ్ కానిస్టేబుల్ చనిపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. కొన్ని అరాచక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయని చెప్పారు.  ఢిల్లీ ఘటనకు రాహుల్ గాంధీ బాధ్యత వహిస్తారా లేక అసదుద్దీన్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

TRS కు ఇదే నా సవాల్

CAA కు వ్యతిరేకంగా TRS ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం పై కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. CAA కు వ్యతిరేకంగా ఎందుకు అసెంబ్లీ లో తీర్మానం చేయాలని,  కేబినెట్ లో ఏ నిర్ణయం తీసుకుందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల కోసం TRS  ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేస్తుందా? అని ప్రశ్నించారు. ఎవరి మెప్పు కోసం  టీఆర్ఎస్  CAA ను వ్యతిరేకిస్తుందో సమాధానం చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ చేశారు.

Latest Updates