వెపన్స్ లేకుండా మన ఆర్మీని పంపిందెవరు?: రాహుల్

  • అలా ఎందుకు పంపించారో చెప్పాలని కేంద్రానికి ప్రశ్న

న్యూఢిల్లీ: లడఖ్ వ్యాలీలో చైనా ఆర్మీతో జరిగిన ఘర్షణలో మన సైనికులను వెపన్స్ లేకుండా ఎందుకు పంపారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘర్షణల్లో 20 మంది సోల్జర్స్ మరణం పై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘నిరాయుధులైన ఇండియన్ సైనికులను చంపడం ద్వారా చైనా పెద్ద నేరానికి పాల్పడింది. వెపన్స్ లేకుండా మన సైన్యాన్ని ఎందుకు పంపించారు? వారి మరణాలకు ఎవరు బాధ్యులు?”అని ఆయన గురువారం ట్విట్టర్ పోస్ట్ చేసిన వీడియో మెస్సేజ్​లో కేంద్రాన్ని నిలదీశారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Latest Updates