ఈ ఇన్నోసెంట్ గర్ల్ ఎవరంటే..?

ఏ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ ఎలా ఆడతాడోనని ఊపిరి బిగపట్టి చూసిన క్షణాల్లో.. కింగ్స్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ పంజాబ్‌‌‌‌ దుమ్మురేపిన విషయం తెలిసిందే. టీ20 ఫార్మాట్‌‌‌‌ హిస్టరీలోనే తొలిసారి రెండు సూపర్‌‌‌‌ ఓవర్లు ఆడిన మ్యాచ్‌‌‌‌లో అద్భుత విజయం సాధించింది.

ఫలితంగా  టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో  176/6 స్కోరు చేసింది. డికాక్‌‌‌‌ (43 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 53) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ 20 ఓవర్లలో 176/6 స్కోరే చేసింది. రాహుల్‌‌‌‌ (51 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఒంటరిపోరాటం చేశాడు.

అయితే స్కోర్లు సమం కావడంతో ఫస్ట్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఓవర్‌‌‌‌ను నిర్వహించారు. ఇందులో పంజాబ్‌‌‌‌ 5 రన్స్‌‌‌‌ చేయగా, ముంబై కూడా అదే స్కోరుకు పరిమితమైంది. ఫలితాన్ని తేల్చేందుకు రెండో సూపర్‌‌‌‌ ఓవర్‌‌‌‌ను వేయించగా, ముంబై 11 రన్స్‌‌‌‌ చేస్తే, పంజాబ్‌‌‌‌ 15 రన్స్‌‌‌‌ చేసి గెలిచింది. ఈ మ్యాచ్ సందర్భంగా ఓ అరుదైన అద్భుతం జరిగింది.

నరాలు తెగే ఉత్కంఠలో ఆడియన్స్ ను అలరించేందుకు కెమోరామెన్ ఓ యువతి అమాయకంగా ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ను  క్యాప్చర్ చేశాడు. అమాయకంగా నోట్లో వేలు పెట్టుకుని మ్యాచ్ చూస్తున్న ఫోటోలతో ఓవర్ నైట్ సోషల్ మీడియా స్టార్ అయ్యింది ఆ సూపర్ ఓవర్ గర్ల్ . ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు చెన్నై సూపర్ కింగ్స్ రైనాను కోల్పోయింది,పంజాబ్ సూపర్ ఓవర్ రియానాను కనుగొంది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు ..ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. ఇన్నోసెంట్ గర్ల్  పేరు రైనా లాల్వాని తెలుస్తోంది.

Latest Updates