డబ్ల్యూహెచ్ఓ పాత్రపై దర్యాప్తు చేస్తున్నాం

  • చైనా పైప్ ఆర్గాన్ గా మారిందంటూ ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్ : కరోనా ఎఫెక్ట్ తో తీవ్రంగా డ్యామేజ్ అయిన అమెరికా మరోసారి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ పనితీరు పట్ల ఏ మాత్రం సంతోషంగా లేమని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చెప్పారు. కరోనా తీవ్రత గురించి ప్రపంచాన్ని అలర్ట్ చేయటంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందంటూ… చైనా చెప్పిన మాటలనే చెబుతూ డ్రాగన్ పైప్ ఆర్గాన్ గా మారిందంటూ అసహనం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిలో డబ్ల్యూహెచ్ఓ పాత్రపైన దర్యాప్తు చేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఇందుకు సంబంధించిన కొంత సమాచారం తమకు అందిందని…ఐతే వైరస్‌ తీవ్రత గురించి డబ్ల్యూహెచ్‌ఓకు ముందే నిజాలు తెలుసా లేదా అన్నది స్పష్టత లేదన్నారు. పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చే అమెరికాను… డబ్ల్యూహెచ్ఓ తప్పుదారి పట్టించిందని కచ్చితంగా చైనాకు ఆ సంస్థ అనుకూలంగా వ్యవహారిస్తుందని అన్నారు. చైనా వ్యవహారించిన తీరును కూడా ట్రంప్ తప్పుబట్టారు. వైరస్ ఎఫెక్ట్ మొదలైన వెంటనే విదేశాల నుంచి విమానాలను చైనా రానివ్వలేదని…ఆ దేశం వ్యవహారం పైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందన్నారు.

Latest Updates