వ్యాక్సిన్ వచ్చినా..కరోనా తగ్గదు

సైంటిస్ట్ లు చేస్తున్న ప్రయోగాలు సత్ఫలితాలు రావడంతో ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వచ్చినా కరోనా ను పూర్తిస్థాయిలో అంతం కాదని  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎమర్జెన్సీ నిపుణులు మైక్ ర్యాన్ హెచ్చరించారు.
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా పూర్తి స్థాయిలో వైరస్ అంతం కాదని, ప్రపంచ దేశాలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్న ర్యాన్… వైరస్ అంతం కావాలంటే చాలా సమయం పడుతుందన్నారు. తీసుకునే జాగ్రత్తల్ని బట్టి వైరస్ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతుందన్నారు. ఇక వ్యాక్సిన్ విడుదలైన వెంటనే అందరికి అందుబాటులోకి రాదని చెప్పారు. ప్రపంచాన్ని పలు వ్యాధుల నుంచి ఈ టీకాలు విముక్తులను చేశాయని చెప్పిన ర్యాన్… కరోనావైరస్ విషయంలో కూడా ఇదే పాత్రను టీకాలు పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest Updates