బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్​ అయ్యేది ఎవరు?

తెలుగు ‘బిగ్‌‌బాస్‌‌–3’  పన్నెండు వారాలు పూర్తి చేసుకుంది. త్వరలో షో ముగియబోతుంది. దీంతో ఫైనల్‌‌కు చేరబోయే కంటెస్టెంట్లు ఎవరు? టైటిల్‌‌ ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఆడియెన్స్‌‌లో పెరిగిపోతోంది. ప్రస్తుతం హౌజ్‌‌లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. వరుణ్‌‌, రాహుల్‌‌, శ్రీముఖి, వితిక, శివజ్యోతి, అలీ రెజా, బాబా భాస్కర్‌‌‌‌లు ఉన్నారు.

ఈ మధ్య జరిగిన ఎలిమినేషన్‌‌ టాస్క్‌‌కు సంబంధించి ఎవరూ సరిగా రూల్స్ పాటించని కారణంగా బిగ్‌‌బాస్‌‌ ఏడుగురిని ఎలిమినేషన్‌‌ జోన్‌‌కు సెలెక్ట్‌‌ చేశాడు. ఈ సీజన్‌‌లో ఇలా ఒకేసారి ఏడుగురు నామినేట్‌‌ కావడం ఇదే తొలిసారి.దీంతో ఏడుగురిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్‌‌ అవుతారనేది ఉత్కంఠగా ఉంది. ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్లు ఈ వారం ఎలిమినేట్‌‌ అవుతారు.అయితే సోషల్‌‌ మీడియా ట్రెండ్‌‌ ప్రకారం ఈ వారం శివజ్యోతి, వితికల్లో ఒకరు ఎలిమినేట్‌‌ అయ్యే చాన్స్ ఉంది. అయితే వరుణ్‌‌కు ఉన్న ఫాలోయింగ్‌‌ వల్ల వితిక సేవ్‌‌ అవ్వొచ్చు. అలాగే బాబా భాస్కర్‌‌‌‌, అలీ రెజాలు కూడా ఎలిమినేషన్‌‌కు దగ్గరగా ఉన్నారు.

ఫైనల్‌‌కు వీళ్లేనా?

అందరిలోకి రాహుల్‌‌, వరుణ్‌‌, శ్రీముఖి ఫైనల్‌‌కు చేరుకునే అవకాశాలున్నాయి. అయితే వితికకు హెల్ప్‌‌ చేసేందుకు రాహుల్‌‌ చేసిన చిన్న పొరపాటు అతడిపై కొంచెం నెగెటివిటీ పెరిగేలా చేసింది. మరోవైపు రాహుల్‌‌ స్ట్రాంగ్‌‌గా మారుతున్నాడు. యాంకర్‌‌‌‌గా శ్రీముఖికి ఉన్న సోషల్‌‌ మీడియా ఫాలోయింగ్‌‌ ఆమెకు హెల్ప్‌‌ అవుతోంది. సినిమా థియేటర్లలో కూడా శ్రీముఖికి ఓట్‌‌ వేయాలంటూ యాడ్స్‌‌ కూడా వేస్తున్నారంటే ఆమె కోసం పబ్లిసిటీ ఏ రేంజ్‌‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇతర పార్టిసిపెంట్ల ఫ్యాన్స్‌‌ కూడా ఇప్పుడు సోషల్‌‌ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా మారారు. తమ ఫేవరెట్‌‌ కంటెస్టెంట్‌‌కు మద్దతుగా పోస్ట్‌‌లు పెడుతూ బిగ్‌‌బాస్‌‌కు మంచి పాపులారిటీ తెస్తున్నారు.

Latest Updates