పోలీసులను పెట్టి జనాలను ఎందుకు అడ్డుకుంటున్నరు: సర్కార్ పై హైకోర్టు

ఉత్తర్వుల్లేకుండా ఆంక్షలా..

అసలు ఆ అధికారం ఎక్కడిది?: హైకోర్టు

ట్రాఫిక్ ను ఏ చట్టం ప్రకారం నియంత్రిస్తున్నరు?

ప్రభుత్వ వైఖరి చెబుతామంటూ ఇంత లేట్ చేస్తా రా?

ఇన్ని రోజులుగా విచారణ జరుగుతుంటే..

ఇప్పుడు రిట్ కు విచారణ అర్హత లేదనడమేంది?

సెక్రటేరియట్ కూల్చివేతల కేసులో సర్కారుపై హైకోర్టు అసహనం

కౌంటర్ వేయాలని ఆదేశం..

రేపటికి విచారణ వాయిదా

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్ కూల్చివేత పనుల కవరేజీ ఇవ్వకుండా మీడియాను అడ్డుకోవడాన్ని, ఆంక్షలు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ చట్టం ప్రకారం మీడియాను రాకుండా అడ్డుకుంటున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నిం చింది. ప్రజలను, ట్రాఫిక్ ను ఏ చట్టం ప్రకారం నియంత్రిస్తున్నారని మండిపడింది. చట్టం లేకుండా, ఉత్తర్వులివ్వకుండా ఆంక్షలు ఎలా పెడతారని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఆంక్షలు పెట్టే అధికారం ప్రభుత్వాని కి ఎక్కడిదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకే ఆంక్షలు పెడితే.. ఆ మేరకు నోటిఫికేషనో లేదంటే సర్క్యులరో ఇచ్చి ఉండాల్సింది కదా అని ప్రశ్నిం చింది. అవి లేకుండా ఆంక్షలు పెట్టడమంటే చట్ట వ్యతిరేకమేనని చెప్పింది. సెక్రటేరియట్ కూల్చివేత పనుల కవరేజీకి మీడియాను అనుమతిం చకపోవడాన్ని సవాల్ చేస్తూ వీ6 చానెల్, వెలుగు పేపర్ తరఫున క్రైం బ్యూరో చీఫ్ జి.సంపత్ దాఖలు చేసిన రిట్ పై శనివారం జస్టిస్ చల్లా కోదండరామ్ విచారణను కొనసాగించారు.

విచారణ అర్హత లేదని ఇప్పుడు చెప్తారా?

మీడియాను అనుమతిం చే విషయంపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకుని చెబుతామంటూ రోజూ అడ్వొకేట్ జనరల్ అంటున్నారని, ఎప్పటికప్పుడు ఈ రోజు..ఆరోజు అంటూ లేట్ చేయడం కరెక్ట్ కాదని హైకోర్టు మండిపడింది. మీడియాకు అనుమతివ్వకపోవడం చట్టవ్యతిరేకమన్న రిట్ లో అంశాలపై ప్రభుత్వం ఏమీ చెప్పట్లేదని, సోమవారం నాటికి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే, కంపెనీ తరఫున డైరెక్టర్ లేదా యజమాని రిట్ దాఖలు చేయాలే తప్ప, కంపెనీ తరఫున ఓ ఉద్యోగి రిట్ పిటి షన్ దాఖలు చేయడం చెల్లదని ఏజీ బీఎస్ ప్రసాద్ అన్నారు . ఈ రిట్ కు విచారణార్హత లేదని, రిట్ ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరారు. కంపెనీలకు ప్రాథమిక హక్కు లు ఉండవని, వ్యక్తు లకే ఉంటాయని, ఈ కోణంలో అయినా రిట్ కు విచారణ అర్హత లేదని ఆయన వాదించారు. దీనిపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ అభిప్రాయం చెబుతామంటూ రోజూ కాలయాపన చేసి.. ఇప్పుడు రిట్ కు విచారణ అర్హత లేదని చెప్పడమేంటంటూ ప్రశ్నిం చింది. అయితే, బెనట్స్ కోల్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కంపెనీ కూడా కేసు దాఖలు చేయవచ్చని సు ప్రీం కోర్టు చెప్పిందని పిటి షనర్ తరఫు లాయర్ నవీన్ కుమార్ వాసిరెడ్డి గుర్తు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తరఫున ఆ కంపెనీ వేసిన వ్యా జ్యాన్ని సుప్రీం కోర్టు ఆమోదించిందని, ఇతర కేసుల్లోనూ మీడియా కంపెనీ కూడా పత్రికా స్వేచ్ఛపై రిట్ పిటిషన్ ను దాఖలు చేయవచ్చంటూ సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందని గుర్తు చేశారు. తమ రిట్ పిటి షన్ లో కంపెనీ యాజమాన్యాన్ని కూడా కేసులో ఇంప్లీడ్ చేస్తామని, అందుకు టైం ఇవ్వాలని కోరారు. అందుకు అ నుమతిచ్చిన హైకో ర్టు.. కంపెనీ కూడా పత్రికా స్వేచ్ఛ కోసం రిట్ దాఖలు చేయొచ్చన్న సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రతులతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్ ను ఆదేశించింది. ప్రభుత్వం కూడా ఆ పిటి షన్ లోని అంశాలకు జవాబులతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది. భద్రత కోసం కూల్చివేత చర్యల గురించి ఏమైనా సర్క్యులర్ ఇచ్చి ఉంటే దానినీ జత చేయాలని ఆదేశించింది. తర్వాతి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

 

Latest Updates