సోషల్ మీడియాలో “ బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్”

సోషల్ మీడియాలో బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్ పేరుతో యాష్ ట్యాగ్ వైరల్ అవుతుంది. 19 ఏళ్ల లిటరేచర్ స్టూడెంట్… కుటుంబ బాధ్యతలతో పాటు తనను ఫాలో అవుతున్న ముగ్గురు అబ్బాయిలతో రొమాన్స్ మధ్య నలిగిపోతుంది. ఈ సిరీస్ లో  హీరోయిన్ తన ముస్లిం లవర్‌తో హిందూ ఆలయంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు.  ఈ సీన్స్ అన్నింటినీ కూడా మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ఉన్న శివాలయంలో తెరకెక్కించారని.. హిందువుల మనోభావాలను గాయపరుస్తూ లవ్ జీహాద్‌ను ప్రోత్సహించేలా ఉన్నాయని బీజేపీ నేత గౌరవ్ గోయల్  ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. సూటబుల్ బాయ్ చిత్రయూనిట్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వివాదానికి సంబంధించిన బాయ్ కాట్ నెట్ ఫ్లిక్స్ పేరుతో యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.

Latest Updates