సహకార ఎన్నికలపై హడావుడి ఎందుకు?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: సహకార ఎన్నికల నిర్వహణపై ఎందుకు హడావుడి చేస్తున్నారని, రైతుల ఓట్లు తొలగించి వారి హక్కులను కాలరాస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. బుధవారం గాంధీభవన్‌‌‌‌లో మాట్లాడుతూ.. ఏ మాత్రం ముందస్తు సమాచారం లేకుండా సహకార ఎన్నికలకు పోతున్నారని, కనీసం ఓటర్‌‌‌‌ లిస్టులో మార్పులు, చేర్పులకు కూడా అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.

దీని ద్వారా కేసీఆర్‌‌‌‌ది రాచరికపు, నిరంకుశ పాలన అని రుజువవుతోందన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చి 14 నెలలు అవుతున్నా రైతు రుణమాఫీ చేయలేదని, దీంతో రైతులపై వడ్డీ భారం పడుతోందన్నారు. ఏ మొహం పెట్టుకుని రైతులను ఓట్లడుగుతారని ప్రశ్నించారు.

Latest Updates