అబ్బే ర‌ష్యా వ్యాక్సిన్ లో అంత‌సీన్ లేదా

ప్ర‌పంచ దేశాలు ఆతృత‌గా ఎదురు చూస్తున్న క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను ర‌ష్యా విడుద‌ల చేసింది. విడుద‌ల చేసిన తొలి వ్యాక్సిన్ ను ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కుమార్తెకు వేయించారు. కానీ ఈ వ్యాక్సిన్ ను వ్యాధిగ్ర‌స్తుల‌కు వేయించేందుకు భార‌త్ తో పాటు ప్ర‌పంచ దేశాలు అంగీక‌రించ‌డం లేదు.

అంతేకాదు ప‌లు దేశాల‌కు చెందిన సైంటిస్ట్ లు ర‌ష్యా విడుద‌ల చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ టీకా వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని విమ‌ర్శించారు.

ఆ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన ర‌ష్యా..తాము 1957లో శాటిలైట్ ను లాంచ్ చేసిన‌ప్పుడు అమెరికాతో పాటు ఇత‌ర దేశాల పౌరులు న‌వ్వార‌ని గుర్తు చేశారు.

ర‌ష్యా వ్యాక్సిన్ పై స్పందించిన ర‌క్ష‌ణ శాఖ మంత్రి

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ కేసులు ఎక్కువ న‌మోద‌వుతున్న జాబితాలో మ‌న‌దేశం మూడో స్థానంలో ఉంది. అయినా ర‌ష్యా వ్యాక్సిన్ పై కేంద్రం సంతృప్తిగా లేదు. గ‌తంలో ర‌ష్యా ప‌ర్య‌‌ట‌న అనంత‌రం ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ సైతం..ర‌ష్యా వ్యాక్సిన్ త‌యారు చేస్తుంద‌ని, భార‌త్ కు స‌ర‌ఫ‌రా చేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు చెప్పారు. కానీ ర‌ష్యా వ్యాక్సిన్ విడుద‌ల చేసినా కేంద్రం స్పందించ‌లేదు.

వ్యాక్సిన్ కొనుగులు చేసేందుకు ఎవ‌రైనా ఆస‌క్తిగా ఉన్నారా..?

ప్ర‌పంచ దేశాల‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం చాలా ఉంది. కానీ వ్యాక్సిన్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించ‌లేదు. ర‌ష్యా వ్యాక్సిన్ తీసుకోవాలా లేదంటే హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ పూర్తి చేసేదాకా వెయిట్ చేయాలా అనే సందిగ్ధ‌త కొన‌సాగుతుంది.

ర‌ష్యా వ్యాక్సిన్ పై సంతృప్తి క‌రంగా లేక‌పోవ‌డానికి కార‌ణాలు

ర‌ష్యా విడుద‌ల చేసిన క‌రోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ గురించి త‌మ‌వ‌ద్ద పూర్తి స‌మాచారం లేద‌ని, ఆ స‌మాచారం ఇవ్వాలంటూ వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ర‌ష్యాను కోరింది. కానీ పుతిన్ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.

జూన్ రెండవ భాగంలో రష్యా స్పుత్నిక్ మొద‌టి ద‌శ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ ను ప్రారంభించింది. ర‌ష్యాతో పాటు చైనా, యూఎస్ మరియు ఐరోపా కు చెందిన కొన్ని కంపెనీలు క‌రోనా వ్యాక్సిన్ పై మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్స్ ను ప్రారంభించాయి.

మిగిలిన దేశాలు సైతం వ్యాక్సిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ను పూర్తి చేయ‌లేదు. ర‌ష్యా మాత్రం మొదటి ద‌శ ట్ర‌య‌ల్స్ ను పూర్తి చేసి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ను విడుద‌ల చేసింది.

ర‌ష్యా ప్ర‌తినిధులు స‌మాచారం ప్ర‌కారం 76మందిపై వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్ పూర్త‌యిన త‌రువాత వ్యాక్సిన్ వినియోగంపై అనుమ‌తి ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇది మ‌న‌దేశంలో క‌రోనా వ్యాక్సిన్ ను ఎదుర్కొనేందుకు ప‌తంజ‌లి ఆయ‌ర్వేద ప‌ద్ద‌తిలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచే టీకా కంటే త‌క్కువ అని తేలింది.

ర‌ష్యా వ్యాక్సిన్ ఉండ‌గా…మ‌రో క‌రోనా వ్యాక్సిన్ కోసం ఎందుకు ఎదురు చూడాల్సి వ‌స్తుంది

ర‌ష్యా వ్యాక్సిన్ త‌యారు చేసిన విధి విధాన‌ల గురించి చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ వ్యాక్సిన్ కు ప్ర‌త్యామ్నాయంగా ఆక్స్ ఫర్డ్ యూనివ‌ర్సిటీ , మోడెర్నాలు టీకాను డెవ‌ల‌ప్ చేస్తున్నాయి. వీటిలో ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ త‌యారు చేస్తున్న టీకాపై అంద‌రూ ఆశ‌గా ఎదురు చూస్తున్నారు.

ఆక్స్ ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ మూడో ద‌శలో ఉంది. ఈ మూడో ద‌శ‌లో 10వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. వారిల వెయ్యిమందికి టీకాను అందించ‌గా మంచి ఫ‌లితాలు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అయితే మూడో ద‌శ మ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యేవ‌ర‌కు వేచి చూడాల్సిందేన‌ని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

Latest Updates