ప్రజల్నిమోసం చేయడానికి కేసీఆర్ సరికొత్త డ్రామా

హైదరాబాద్‌, వెలుగు: సంగమేశ్వరం ప్రాజెక్టును 8 నెలల క్రితమే ఏపీ ప్రకటించిందని, దాని వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతోందంటూ ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నా సీఎం కేసీఆర్ ఇన్నాళ్లూ ఎందుకు నోరు మెదపలేదని మాజీఎంపీ, బీజేపీ కోర్‌ కమిటీ సభ్యుడు వివేక్‌ ‌‌‌వెంకటస్వామి ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్నవ్యతిరేకతను గమనిం చే టెండర్లప్రక్రియ మొదలవుతున్న సమయంలో కొత్త డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. ఇదంతా ప్రజలను మరోసారి మోసం చేయడానికేనని ఫైరయ్యారు. ఈ మేరకు వివేక్ వెంకటస్వామి మంగళవారం ఒక ప్రకటన చేశారు. ఏపీ సీఎం జగన్ తో తమకు సన్నిహిత సంబంధాలున్నాయని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ప్రకటించారని,దాని వల్ల జరిగిన డ్యామేజీని కంట్రోల్‌‌‌ ‌చేసుకోవడానికే కృష్ణా ప్రాజెక్టులపై కొట్లాడుతున్నట్టు ప్రకటన చేశారన్నారు.

మేఘా కృష్ణారెడ్డికి సంగమేశ్వరం టెండర్లు దక్కాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ అపెక్స్‌‌ ‌‌కౌన్సిల్‌‌‌‌కు వెళ్లలేదన్నారు. సంగమేశ్వరం ప్రాజెక్టు టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఇకపై ఏ పనులూ ఇవ్వొద్దని, ఇప్పటికే ఇచ్చిన కాంట్రాక్టులనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రాజెక్టులపై ఏపీ ఇప్పటికే జీవో లిచ్చిందని, టెండర్లకు కూడా వెళ్తొందని, ఇప్పటివరకు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తీసుకురావాలన్నారు. నీళ్లవిషయంలో ఇన్నాళ్లు కేసీఆర్‌ మాయమాటలు చెప్తూ కాలం వెళదీశారని, ఇకపై అవి నడవవన్నారు. సీఎం కేసీఆర్ కు ఉప ప్రధాని కావాలనే కోరిక ఉందని,అందుకే జగన్తో దోస్తీ చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. ఏపీ ప్రాజెక్టులను ఆపకుంటే కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారన్నారు.

Latest Updates