నిజామాబాద్ లో KCR ఎందుకు ఓడారంటే..?

నిజామాబాద్ లోక్ సభ ఎన్నిక. పసుపు రైతులు 176 మంది పోటీలో నిలవడంతో రాష్ట్రంలోనే కాదు.. దేశమంతటా హాట్ టాపిక్ అయింది. టీఆర్ఎస్  ఈ ఎన్నికలో ఎవరు గెలుస్తారన్నదానిపై అన్ని పార్టీలు, ప్రజలు ఓ నజర్ వేశాయి. నిజామాబాద్ ప్రజలు అక్కడ సంచలన తీర్పు ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు స్పష్టమైన తీర్పునిచ్చిన నిజామాబాద్ జిల్లా ఓటర్లు…లోక్ సభకు వచ్చేసరికి తీర్పును దానిని సవరించారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ ఓటమికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుతో సహా, పసుసు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధరపై గతేడాది చివర్లో రైతులు పోరుబాట పట్టారు. నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ రైతులు కొన్ని నెలలపాటు ఆందోళన చేశారు. తమ సమస్యలన్నీ దేశానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో మూకుమ్మడిగా నిజామాబాద్ బరిలో నిలిచారు. పసుపు బోర్డు అంశం రాష్ట్ర పరిధిలోనిది కాకపోయినా…గిట్టుబాటు ధరపై రైతులతో రాష్ట్ర ప్రభుత్వం తరపున  మాట్లాడింది లేదు. ఎవరు పోటీ చేసిన గెలుపు తమదేనన్న ధీమాతో..రైతుల్ని టీఆర్ఎస్ పట్టించుకోలేదన్న వాదనలున్నాయి. ఈ అంశాన్ని బీజేపీ క్యాచ్ చేసింది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్..పక్కా ప్లాన్ తో ముందుకెళ్లారు. కేంద్ర నాయకులతో నిజామాబాద్ లో సభలు పెట్టించారు. అవి బాగానే వర్కవుట్ అయినట్టు ఫలితాలతో తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ కూడా బీజేపీకే మద్దతిచ్చినట్టు లోకల్ గా చెప్పుకుంటున్నారు. ఓవరాల్ గా చూస్తే నిజామాబాద్ ఓటమి కవితది కాదు…కేసీఆర్ దేనని చెప్తున్నారు విశ్లేషకులు.

Latest Updates