అంబేద్కర్ ఉత్సవాల్లో KCR ఎందుకు పాల్గొనరు? :విజయశాంతి

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను హైదరాబాద్ లోని ఆయన ఇంట్లో కలిసి సంఘీభావం ప్రకటించారు రాష్ట్ర పీసీసీ నాయకురాలు విజయశాంతి. పంజాగుట్టలో పెట్టాలనుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని విరగొట్టడం దారుణమని ఆమె అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఏనాడూ కేసీఆర్ పాల్గొనడం లేదని… ఆయన ఎందుకు ఇలా దూరంగా ఉంటున్నారో జవాబు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

“125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటివరకు ఆ విగ్రహం ఏర్పాటుచేయలేదు. కానీ పెట్టిన అంబేద్కర్ విగ్రహాలను కూల్చుతున్నారు. బడుగు బలహీన వర్గాల మీద కేసీఆర్ కు ప్రేమ ఉండదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం తప్పా…? ఉద్యమాలు చేయకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిందా..? ” అని విజయశాంతి ప్రశ్నించారు.

Latest Updates