ప్రైవేట్ లో ఆన్ లైన్ క్లాసులను ఎందుకు బ్యాన్ చేస్తలేరు?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అకడమిక్ ఇయర్ ఇంకా స్టార్ట్ కాలేదంటున్న సర్కార్… ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసులు జరుగుతుంటే ఎందుకు బ్యాన్ చేయడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆన్‌‌లైన్‌‌ క్లాసులు ప్రారంభించడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌‌ స్కూల్స్‌‌ పేరెంట్స్‌‌ అసోసియేషన్‌‌ ఫైల్ చేసిన పిల్‌‌ పై చీఫ్‌‌ జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డిల డివిజన్‌‌ బెంచ్‌‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ పై ఎక్స్ పర్ట్స్ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, దీనిపై సర్కార్ వారంలోగా నిర్ణయం తీసుకుంటుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.సంజీవ్ కుమార్ హైకోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు పైవిధంగా ప్రశ్నించింది. అలాగే ఆదిలాబాద్ లాంటి ట్రైబల్ ఏరియాల్లో కరెంట్, ఇంటర్నెట్ సౌలతులు ఉండయని, అలాంటప్పుడు ఆన్ లైన్ క్లాసులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. విచారణను 22కు వాయిదా వేసింది.

మన బండి దగ్గరకు వచ్చి కరోనా టెస్ట్ చేస్తారు

Latest Updates