టీమిండియా కోచ్ రవిశాస్త్రీ.. ఎందుకంటే?

why-ravi-shastri-was-chosen-as-india-head-coach-cac-members-kapil-dev

టీమిండియా కోచ్ గా మళ్లీ రవిశాస్త్రీ ఎంపిక కావడంపై క్లారిటీ  ఇచ్చారు క్రికెట్ అడ్వైజరీ కమిటీ ( సీఏసీ)అధ్యక్షులు కపిల్ దేవ్. జట్టును ఎలా ముందుకు నడిపించాలనే దానిపై ప్రెజెంటేషన్ ఇవ్వడంలో మిగతా వారి కంటే శాస్త్రీకి ఎక్కువ మార్కులు వచ్చాయని  అందుకే అతడిని మళ్లీ కోచ్ గా ఎంపిక చేసినట్టు చెప్పారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లో శాస్త్రి అందరి కంటే ముందున్నాడని అన్నారు.  రవిశాస్త్రి కోచ్ గా ఎంపిక కావడంలో కొహ్లీ ప్రభావం లేదన్నారు. తామంతా ఏకగ్రీవంగా రవిశాస్త్రీని కోచ్ గా ఎంపిక చేశామని చెప్పారు కపిల్ .

కోచ్ గా ఎంపిక చేయడంలో  కోచింగ్‌ తత్వం, అనుభవం, విజయాలు, కమ్యూనికేషన్‌, ఆధునిక టూల్స్‌పై విజ్ఞానం వంటి ఐదు అంశాలు పరిగణలోకి తీసుకున్నామన్నారు.  వీటన్నింటికి మార్కులు వేశామని అందులో ముగ్గురికి వచ్చిన మార్కుల్లో తేడా చాలా తక్కువ అన్నారు కపిల్.

Latest Updates