కంగన వివాదంపై బాలీవుడ్ మౌనమేల?

శివ సేన ఎంపీ సంజయ్ రౌత్

న్యూఢిల్లీ: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌‌, మహారాష్ట్ర సర్కార్‌‌‌‌కు మధ్య జరుగుతున్న వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. తాజాగా ఈ వివాదంపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ కామెంట్ చేశారు. శివ సేన అధికార పత్రిక సామ్నాలో రోఖ్‌‌‌‌తోక్ కాలమ్‌‌‌‌లో సంజయ్ బాలీవుడ్ సెలబ్రిటీల గురించి వ్యాఖ్యలు చేశారు. ఈ వివాదాన్ని ముంబై ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా రౌత్ పేర్కొన్నారు. ఖిలాడీ అక్షయ్ కుమార్ పేరును ప్రస్తావిస్తూ.. ముంబైలో డబ్బు, పేరు, ప్రతిష్ఠలు సంపాదించిన బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వివాదంపై ఎందుకింత నిశ్శబ్దంగా ఉంటున్నారని రౌత్ ప్రశ్నించారు. ముంబై ఉన్నది కేవలం డబ్బులు సంపాదించుకోవడం కోసమేనా అని క్వశ్చన్ చేశారు. ముంబైని పీవోకేగా పేర్కొన్న కంగన వ్యాఖ్యలను బాలీవుడ్ సెలబ్రిటీలు ముందుకొచ్చి ఖండిచాల్సిందన్నారు.

Latest Updates