‘టీచర్లకు కూడా సెలవులియ్యాలి’

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు ఆర్డర్​మేరకు టెన్త్ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం, టీచర్లకు కూడా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్​పీసీ), టీచర్స్ యూనియన్స్​జేఏసీ(జాక్టో) కోరింది. శుక్రవారం విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రారాంచంద్రన్​ను ఆయా సంఘాల స్టీరింగ్​కమిటీల మెంబర్స్​కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీచర్లు బడికి రావాల్సిందేనని అధికారులు అంటున్నారన్నారు. దీనివల్ల జర్నీలో కరోనా వస్తుందేమోననే భయంలో టీచర్లున్నారన్నారు.

Latest Updates