ఆవేశంలో కేసీఆర్ ను తిడితే అరెస్ట్ చేస్తారా? : బాధిత మహిళ

జగిత్యాల జిల్లా:  సీఎం కేసిఆర్ ను తిట్టినందుకు అన్యాయంగా తనను అరెస్ట్ చేశారని తెలిపారు బాధిత మహిళ . రాయికల్ మండలం, తాట్లవాయి గ్రామానికి చెందిన బాణావతు లక్ష్మీ అనే మహిళ ఇటీవల యూరియా కోసం చేపట్టిన ధర్నాలో కేసీఆర్ ను తిట్టారు. దీంతో ఆమెపై స్థానిక టీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేశారు పోలీసులు.

ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మి..ఇదెక్కడి న్యాయం అన్నారు.  “యూరియా బస్తాల దొరకక రాష్ట్రమంతా ధర్నా చేసినప్పుడు ఆవేశంలో కేసీఆర్ ను నాలుగు మాటలన్నాను.  దీంతో మహిళ అని కూడా చూడకుండా అరెస్టు చేసి ఆరు గంటలు పోలీసు స్టేషన్ లో ఉంచారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా?. రైతులు మాట్లాడితే తప్పు పడుతున్నారు. యూరియా కొరత తీర్చడంలో ప్రభుత్వం తప్పేమీ లేదా. హిందుగాళ్లు బొందుగాళ్లు అంటే కేసీఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదు?. అని ఆవేదన వ్యక్తం చేశారు లక్ష్మి.

Latest Updates