WIC సదస్సు సక్సెస్ : ఘనంగా ముగింపు వేడుకలు

KTRFహైదరాబాద్ లోని HICCలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ముగింపు వేడుకలు బుధవారం (ఫిబ్రవరి-21) ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మంత్రి కేటీఆర్, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె హాజరయ్యారు. మూడు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC) వేదికగా ఈ సదస్సు జరిగింది. వివిధ దేశాల నుంచి IT కాంగ్రెస్‌కు హాజరైన అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు మంత్రి కేటీఆర్. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సుతో రాష్ట్రానికి మంచి సత్ఫలితాలు వచ్చాయన్నారు. దిగ్గజ కంపెనీల నుంచి అగ్రిమెంట్లు లభించాచన్నారు. మూడు రోజుల పాల జరిగిన ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందన్నారు మంత్రి కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates