కాళ్లు పట్టుకున్నా వినలేదు: విద్యార్థిపై భార్య భర్తలు దాడి

హైదరాబాద్ : సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. రౌండ్  టేబుల్  ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై మహిళ దాడికి పాల్పడింది. పాఠశాల విద్యార్థులు ఆటలాడుతూ అల్లరి చేస్తున్నారని  ….. బాలుడిపై మహిళ, ఆమె భర్త దాడి చేశారు. అతను ఏమీ చేయలేదని తోటి విద్యార్థి చెప్పినా వదల్లేదు.

దెబ్బలకు తట్టుకోలేక బాలుడు కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఆమె కనికరించలేదు. లేబర్ పిల్లలు, చిల్లరగాళ్లు అంటూ నోటికొచ్చినట్లు తిట్టింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు విద్యార్థిపై దాడికి పాల్పడిన దంపతులను అదుపులోకి తీసుకున్నారు.

see also: 93 ఏళ్ల వయసులో పీజీ పట్టా

see also: ‘నాన్న’కూ 7 నెలల సెలవులు

చెర్రీ నెక్స్ట్ సినిమా చిరుతోనా.. వెంకీతోనా..

Latest Updates