మోడీ బయోపిక్ లో భార్యగా టీవీ నటి బర్ఖా బిష్ట్

ప్రధాని నరేంద్రమోడీ బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఓమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మోడీ నిజజీవితంలో తల్లి పాత్ర, భార్య పాత్ర ఎంతో కీలకం. ప్రస్తుతం ఆ పాత్రలలో ఎవరు నటిస్తున్నారో తెలిపింది చిత్ర యునిట్. బయోపిక్ లో మోడీ తల్లి హీరాబేన్ గా…  సీనియర్ నటి జరీనా వహాబ్, భార్య జశోదాబెన్ గా టీవీనటి బర్ఖా బిష్ట్ నటిస్తున్నారు.

ప్రధాని మోడీ బయోపిక్ లో..  మోడీ తల్లి పాత్రలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు జరీనా వహాబ్, వీరు.. చాక్ ఎన్ డస్టర్, దిల్ ధడక్‌నే దో, విశ్వరూపం, అగ్నీపథ్, మైనేమ్ ఈ జ్ ఖాన్ సినిమాల్లో నటించారు.

Latest Updates