నాకు మొగుడొద్దు..టిక్ టాకే ముద్దు

నీకు టిక్​టాక్​ కావాలా.. నేను కావాలా..తేల్చుకో’ అడిగాడో భర్త! ‘నువ్వేమొద్దు.. నాకుటిక్​టాకే ముద్దు’ తేల్చి చెప్పిందో భార్య!! బెంగళూరుకు చెందిన దంపతుల కాపురంలో టిక్​టాక్​ పెట్టిన చిచ్చిది. టిక్​టాక్​లో లక్షల మంది ఫాలోవర్లు.. చేసే వీడియోలకు లైకులు, షేరింగులు..అవన్నీ నచ్చిన ఆమె, 12 ఏళ్ల తన పెళ్లి బంధానికి బైబై చెప్పింది. భర్తను కాదని టిక్​టాక్​నే ఎంచుకుంది. 2008లో వాళ్లిద్దరికీ పెళ్లయింది. 2014లో వాళ్లకు కొడుకు పుట్టాడు. తర్వాత సౌదీ అరేబియాలో జాబ్ రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు భర్త. అప్పట్నుంచి పక్కింటామె రిక్వెస్ట్​తో టిక్​టాక్​లో ఎంటరైన ఆ భార్య, దానికి అడిక్ట్​ అయిపోయింది. తరచూ వీడియోలు పోస్ట్​ చేసేది. దీంతో ఆమెకు ఫాలోవర్లు పెరిగిపోయారు. కొన్నేళ్లలోనే లక్షల మంది ఫాలోవర్లు ఆమెకు జమ అయ్యారు .

గత ఏడాది ఆమె భర్తకు, తన స్నేహితుడు ఆమె చేసిన టిక్​టాక్​ వీడియో పంపడంతో కంగు తిన్నాడు. ఆ వీడియోలో ఆమె అసభ్యంగా డ్యాన్స్​ చేయడం, దానికి లక్షలాది లైకులు, అసభ్యకామెంట్లు రావడంతో భర్తకు కోపమొచ్చింది. ఫోన్​ చేసి భార్యను నిలదీశాడు. వీడియో కాల్​ చేసి భార్యతో గొడవపడ్డాడు. అయితే, తానేమీ అసభ్యంగా డ్యాన్స్​ చేయలేదని, అతడి ఫ్రెండే తన వీడియోను మార్ఫ్​ చేశాడని ఆమె వాపోయింది. అయితే, ఆమె చెప్పిన మాటలు నమ్మని భర్త, గతఏడాది అక్టోబర్ లో మంచి జీతం వస్తున్న జాబ్ ను వదిలేసి ఇండియాకు వచ్చేశాడు. ఫోన్​లో భార్య చేసిన టిక్​టాక్​ వీడియోలను చూశాడు.అయితే, తనను అనుమానిస్తున్నావంటూ భార్యఏడ్చేసింది. కానీ, ఇంట్లోనే చేసిన ఓ వీడియోతో భార్య గుట్టంతా బయటపడిపోయింది. గట్టిగా నిలదీస్తే తానే ఆ వీడియోలు చేశానని ఒప్పుకుంది. దీంతో భర్త పోలీసుల దగ్గరకు వెళ్లాడు. పోలీసులు అతడిని ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరకు పంపించారు. అక్కడ టిక్​టాక్​ వదిలేయాలని భర్త మందలించినా భార్య వినలేదు. తాను టిక్​టాక్​ను వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. లక్ష-లాది మంది అభిమానులను నిరాశపరచలేనని తెలిపింది. అయితే, వాళ్లిద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకే తాము ప్రయత్నిస్తున్నామని ఫ్యామిలీ కౌన్సిలర్ ఇక్బాల్​ అహ్మద్ చెప్పారు.

Latest Updates