ప్రేమ‌పెళ్లి చేసుకున్న భ‌ర్త‌ మోసం చేశాడ‌ని భార్య ధర్నా

రంగారెడ్డి జిల్లా : ప్రేమించి పెళ్లి చేసుకున్న భ‌ర్త మోసం చేశాడ‌ని ఓ మ‌హిళ భ‌ర్త ఇంటి ముందు ధ‌ర్నాకు దిగింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గంలోని ఫరూక్ నగర్ మండలం, అన్నారం గ్రామంలో జ‌రిగింది. అన్నారం గ్రామానికి చెందిన పూజ, అదే గ్రామానికి చెందిన గోపాల్ ఇద్దరు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అనంతరం యువతికి కుటుంబ సభ్యులు మరోక్కరితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే యువతికి పెళ్లి చేస్తారన్న విషయం తెలుసుకున్న గోపాల్.. కచ్చితంగా యువతిని పెళ్లి చెసుకుంటానని చెప్పి, మే 20వ తేదీన పెళ్ళి చేసుకున్నారు.

అనంతరం షాద్ నగర్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు వర్గాల కుటుంబ సభ్యులను సముదాయించి, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. అయితే ఈ మధ్య కాలంలో ఎం జరిగిందో తెలియదు కానీ.. ప్రస్తుతం భర్త భార్యను వద్దని అనడంతో ..భార్య భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది మ‌హిళా. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మ‌హిళ‌ను స‌ముదాయించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates