వరవరరావును రిలీజ్ చేయండి : సుప్రీంకోర్టుకు సహచరి బహిరంగ లేఖ

హైదరాబాద్: మహారాష్ట్ర భీమా కోరేగావ్ హింస కేసులో అరెస్టైన విరసం నేత పెండ్యాల వరవరరావును విడుదల చేయాలని కోరుతూ… ఆయన సహచరి హేమలతా రావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగలేఖ రాశారు. సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో ప్రజాసంఘాల నేతలు, మేధావులతో కలిసి ఆమె మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. చుక్కా రామయ్య, పుత్తూరి వెంకటేశ్వరరావు, రైటర్ కన్నబిరన్, ప్రొ.హరగోపాల్, దేవులపల్లి అమర్ పలువురు ప్రజాస్వామ్య వాదులు పాల్గొన్నారు. వరవరరావును విడుదలచేయాలంటూ…  సంఘీభావం తెలిపారు 700 మంది ప్రజాస్వామికనాదులు.

న్యాయ యంత్రాంగాన్ని, చట్టాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. 30 యేళ్ళుగా అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది. వరవరరావు చేసిన నేరమేంటి? – పుత్తూరి వెంకటేశ్వర్ రావు

తెలుగు సమాజంపై వరవరరావు తనదైన ముద్ర వేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఈ లేఖ చేరవేస్తా. వరవరరావు స్వేచ్చకొరకు మాట్లాడటమంటే సమాజ స్వేచ్చ కోసం మాట్లాటమే-ప్రొ.హరగోపాల్.

అర్బన్ నక్సలైట్ల అంటూ ప్రజలను భయపెట్టే వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. వరవరరావు అరెస్ట్ ఆయన ఒక్కడి సమస్యమాత్రమే కాదు. ప్రజాస్వామ్యవాదులందరిది. –కన్నబిరన్

వరవరరావు అరెస్టును ప్రజాస్వామ్య వాదులందరూ ఖండిచాల్సిన అవసరముంది. ప్రజాస్వామ్య వాదులందరికీ ఆయనతో భావచైతన్య సంబంధం ఉంది. ప్రజాస్వామిక చైతన్యవాదులందరికీ వరవరరావు ఒక నమూనా. వరవరరావుని బెయిల్ పై వెంటనే విడుదల చేయాలి. -కాత్యాయని విద్మహే, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత.

ఏ నేరం రుజువు కాకుండా.. వరవరరావుని ఇన్ని రోజులూ జైల్లోఉంచాల్సిన అవసరం లేదు. నేటి సమాజంలో మీడియా సరైన పాత్ర పోషించడం లేదు. జైల్లో వరవరరావు రావు దుర్భరమైన పరిస్థితుల మధ్య కాలం గడుపుతున్నాడు. -దేవులపల్లి అమర్, సీనియర్ జర్మలిస్ట్.

బీమా కోరేగావ్ కేసు ఒక అబద్దపు కేసు – వేణు, వీక్షణం ఎడిటర్

ప్రజల కోసం పోరాడుతున్న మనిషి వరవరరావు. ఆయనను వెంటనే విడుదల చేసి ఆయన కేసులు కోర్టులో వాదించేలా చేయాలి. చేయని నేరాలకు అరెస్టు చేసి హింసించడం సరికాదు. ఇది కొందరి అభిప్రాయం కాదు, దేశంలోని ప్రజాస్వామ్య వాదుల అందరి అభిప్రాయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుని గౌరవంగా స్వీకరించి కేసును విచారించవలసిందిగా కోరుతున్నాము. –చుక్కా రామయ్య, ప్రముఖ విద్యావేత్త.

Latest Updates