అత్త చనిపోతే నవ్వింది : భార్యను చంపిన భర్త

ముంబై: అత్త చనిపోతే కోడలు ఏడ్చినట్టు అనే సామెతను నిజాం చేసింది ఓ కోడలు. అయితే ఆమె మురిపెం ఎక్కువసేపు ఉంలేదు. నా తల్లి  చనిపోతే.. నువ్వు నవ్వుతావా అంటూ భర్త ఆమెను చంపేశాడు. ఈ సంఘటన మార్చి-9న జరుగగా ఆలస్యంగా తెలిసింది. పశ్చిమ మహారాష్ట్రలోని జునారాజ్‌ వాడలో.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మాలతి అనే వృద్ధురాలు మార్చి 9న చనిపోయింది. ఈ విషయం తెలిసిన ఆమె కోడలు శుభంగి లోఖండే(35) ఎంతో ఆనందపడింది.

ఆ ఆనందాన్ని మనసులో దాచుకోలేకపోయింది. మాటల్లో వ్యక్తం చేయడంతో ఆమె భర్త, మాలతి కుమారుడు సందీప్‌ లోఖండేకు పట్టరాని కోపం వచ్చింది. ఆవేశంతో ఆమెను ఇంటి పైఅంతస్తు నుంచి తోసి పడేశాడు. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ‘‘అత్త మృతిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడలు’’ అని మొదట్లో స్థానిక మీడియా కూడా వార్తలు ప్రసారం చేసింది. ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు పోలీసులు.

 

 

Latest Updates