నిత్య పెళ్లికొడుకు..నాలుగు పెళ్లిళ్లు చేసుకొని..

నేను దుబాయ్ లో జాబ్ చేస్తున్నా..లక్షల్లో జీతం వస్తుందంటూ ఓ కేటుగాడు ఇప్పటికి నాలుగుపెళ్లిళ్లు చేసుకున్నాడు.  నాలుగో భార్యను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త చిత్రహింసలకు పాల్పడుతుండడంతో ఏం చేయాలో పాలు పోని ఆ ఇల్లాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిత్యపెళ్లికొడుకు బాలకృష్ణ పవన్ కుమార్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం పేరుతో మ్యాట్రీమోనీ సైట్ లో మహిళల్ని నమ్మించి మోసం చేసేవాడు. ఇతగాడి మాటలు నమ్మి నలుగురు మహిళలు మోసపోయారు.

ఇలా మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ను ఆసరగా చేసుకొని 2018లో పవన్..,హిమబిందును నాలుగో వివాహం చేసుకున్నాడు. వివాహానికి కట్నం కింద రూ.30లక్షల తీసుకున్నాడు. అయితే వివాహం అనంతరం బాధితురాలు హిమబిందు దుబాయ్ వెళ్లిన తరువాత భర్త పవన్ తన మోసాన్ని బయటపెట్టాడు. ఇప్పటికే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు, తనకు పిల్లలు ఉన్నారని, ఈ విషయాన్ని ఎవరికి చెప్పకూడదంటూ  తన తల్లిదండ్రుల సహకారంతో బాధితురాల్ని బెదిరించాడు. బాధితురాలు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని అనడంతో చిత్రహింసలకు గురిచేశాడు.   దీంతో గతేడాది  పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఆ కేసును వెనక్కి తీసుకోవాలని అత్తమామ, పవన్ స్నేహితులు తనని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్  మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుణ్ని కటకటాల వెనక్కి నెట్టేందుకు సిద్ధమయ్యారు.

Latest Updates