ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి చెందిన సంఘటన చైతన్య పురి పోలీసు స్టేషన్ పరిధిలోజరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసినట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం బాణావత్ దులియా అలియాస్ శంకర్ (33)నల్గగొండ జిల్లా డిండి మండలం దేవత్ పల్లి తండా వాసి. ఇతడు సంవత్సరం నుంచి తన భార్య విజయ(28) ఇద్దరు పిల్లలు సిద్దు(10)ఇందు(8)లతో చైతన్యపురి యాదవ్ నగర్లో ఉంటున్నాడు. శంకర్ భార్య కిషన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలనుకుంది. శనివారం రాత్రి ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. అతడితో మద్యం తెప్పించింది. అందులో విషం కలిపి భర్తతో తాగించింది. శంకర్ స్పృహ కోల్పోయాక ప్రియుడుతో కలిసి భర్తను దిండుతో ఊపిరాడకుండా చేసి హత్యచేసింది. అనంతరం శంకర్ కరెంట్ షాక్ తో చనిపోయినట్లు కొత్తపేటలో ఉండే శంకర్ అన్న కుమారుడు బాణావత్ దశరథ్ కు కి షన్ ఫోన్ చేసి చెప్పా డు. అక్కడి చేరుకున్న దశరథ్ తన బాబాయి మృతదేహాన్ని పరిశీలిం చాడు. అక్కడ కరెంట్ షాక్ కొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో ఇది తన పిన్ని, కిషన్ ల పనేనని అనుమానం వచ్చి చైతన్య పురి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన చైతన్య పురి పోలీసులు శంకర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ కి తరలించారు. శంకర్ భార్య విజయ,ఆమె ప్రియడు కిషన్ల పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates