14 వేల మంది ఫైర్ ఫైటర్లు ప్రయత్నిస్తున్నా.. అమెరికాలో ఆగని కార్చిచ్చు

కాలిఫోర్నియా స్టేట్ లో చెలరేగిపోతున్న కార్చిచ్చు

ఎల్ రాంచ్ డొరాడో పార్కులో ఓ ఫ్యామిలీ నిర్వాకం వల్లే

58 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

ముందు జాగ్రత్తగా 8 జాతీయ పార్కులు మూసివేత

20 లక్షల ఎకరాల్లో మంటలు

లాస్ ఏంజెలిస్: అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ లో కార్చిచ్చు చెలరేగిపోతోంది. ఇప్పటి వరకూ స్టేట్ లో 20 లక్షల ఎకరాలలో వైల్డ్ ఫైర్స్ వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని దక్షిణ ప్రాంతంలో ఇవి ఎక్కువగా వ్యాపిస్తున్నాయని, పోయిన నెలలోనే ముగిసిన ఎండాకాలం వల్ల ఎక్కడ చూసినా ఎండు గడ్డి ఉండటం, వాతావరణం అనుకూలంగా ఉండటంతో కార్చిచ్చులు మరింతగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ముందు జాగ్రత్తగా స్టేట్ లోని 8 నేషనల్ ఫారెస్టులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తర ప్రాంతంలోని 21 కౌంటీల్లో 1.58 లక్షల మంది కస్టమర్లకు పవర్ సప్లైని కూడా ఆపేస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది ఫైర్ ఫైటర్లు మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో అత్యధికంగా వైల్డ్ ఫైర్స్ వ్యాపించాయి.

డివైజ్ పేల్చి.. పార్కును అంటువెట్టిండ్రు..

లాస్ ఏంజెలిస్ సమీపంలోని ఎల్ రాంచ్ డొరాడో పార్కులో ఓ ఫ్యామిలీ నిర్వాకం వల్లే భారీ వైల్డ్ ఫైర్ పుట్టింది. పుట్టబోయేది ఆడ బిడ్డా, మగబిడ్డా అని ఫ్రెండ్స్, చుట్టాలకు వెల్లడించేందుకు అమెరికన్లు స్పెషల్ పార్టీలు చేసుకుంటుంటారు. ఈ పార్టీల్లో బ్లూ లేదా పింక్ కలర్ లో పొగలను రిలీజ్ చేసే డివైజ్ లను పేలుస్తుంటారు. బ్లూ కలర్ పొగ వస్తే .. మగ బిడ్డ అని, పింక్ కలర్ పొగ వస్తే ఆడపిల్ల అని అర్థం. అయితే, శనివారం ఎల్ రాంచ్ పార్కుకు తమ పిల్లలతో పాటు వెళ్లిన ఇద్దరు భార్యాభర్తలు.. వీడియో తీస్తూ.. డివైజ్ పేల్చడంతో పొగకు బదులుగా మంటలు వచ్చాయి. వాటర్ బాటిళ్లతో నీళ్లు పోసినా.. లాభం లేక ఫైర్ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. దీంతో చుట్టుపక్కల ఉంటున్న 54 వేల మందిని అధికారులు తరలించాల్సి వచ్చింది.

Latest Updates