‘అన్నదమ్ములు ఇట్లుండాలె’

అన్నదమ్ముల అనుబంధం అంటే..  భూమ్మీద ఉన్నంత కాలం.. భుజం భుజం కలసి నడవాలి. కష్టాలూ, నష్టాలూ కలిసి పంచుకోవాలి. ‘అన్నదమ్ములు ఇట్లుండాలె’ అని నలుగురు మంచిగా మాట్లాడుకోవాలి. చూస్తుంటే..   రామ లక్ష్మణుల్ని, పంచపాండవుల్ని గుర్తుతేవాలి. కానీ, ఇప్పుడు ఇలాంటివాళ్లున్నారా? అంటే  తక్కువే! పెళ్లి కాగానే.. చాలామంది పేరూ, పేగూ మొదలు అన్ని మర్చిపోతుంటారు. ఇగో.. అన్నదమ్ములంటే ఈ సింహాల్లాగ ఉండాలి. ‘ఈ సింహాలు రెండు అన్నదమ్ములు. వేటకెళ్లొచ్చి రెస్ట్‌‌ తీసుకోవడానికి ముందు రెండూ  ముఖాలతో ఇలా అర నిమిషం పాటు ప్రేమగా నిమురుకున్నాయి. ఇలాంటి అరుదైన దృశ్యం చూసే అవకాశం అందరికీ రాదు’ అని ఈ ఫొటో తీసిన డేవిడ్‌‌ లాయిడ్‌‌ చెప్పాడు. ఈ ఫొటోకి పోయిన సంవత్సరం ‘వైల్డ్‌‌లైఫ్‌‌ ఫొటోగ్రాఫర్ ఆఫ్‌‌ ది ఇయర్‌‌‌‌‌‌‌‌’ అవార్డ్‌‌ దక్కింది.

Latest Updates