వన్యప్రాణుల మాంసాన్ని అమ్ముతున్న ఇద్దరిపై కేసులు

పెద్దపల్లి జిల్లా : సీక్రెట్ గా వన్య ప్రాణుల మాంసాన్ని అమ్ముతున్న ముఠాగుట్టు రట్టు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఈ సంఘటన శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని మంథని మండలం, బిట్టుపల్లి గ్రామంలో శుక్రవారం కొండ గొర్రెను వధించి మాంసం విక్రయిస్తున్నారు అదే గ్రామానికి చెందిన పాలకొండ సారయ్య, ముత్తారం మండలం మైదం బండ గ్రామానికి చెందిన కేతిరి రమేష్‌.

సమాచారం అందుకున్న అధికారులు మాంసం అమ్ముతుండగా సారయ్య, రమేష్ ను పట్టుకుని కేసు నమోదు చేశామన్నారు. నిందితుల దగ్గర నుంచి రెండు కిలోల మాసం, కత్తులు, తోలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ దాడుల్లో ఫారెస్ట్ అధికారి షౌ కత్ అలీ, ఎఫ్‌ఎస్‌వోలు హాసన్ ఖాన్, అన్వర్, అమిదుద్దిన్, తిరుపతి, ఎఫ్బీవోలు అఫ్జల్, శ్రావణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు.

Latest Updates