పట్టా చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటాం

తహసీల్దార్​ ఆఫీస్​ ఎదుట పెట్రోల్​ సీసాతో బైఠాయించిండు
భూమిని పట్టా చేయట్లేదని రైతు ఆందోళన

నాగారం వెలుగు: తన భూమిని పట్టా చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని,  కుటుంబసభ్యులతో కలిసి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి తహసీల్దార్‌‌ ఆఫీస్‌‌ ఎదుట ధర్నాకు దిగాడు. ఈ సంఘటన బుధవారం సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలో జరిగింది. నాగారం మండల పరిధిలోని పేరబోయిన గూడెం గ్రామానికి చెందిన బోయిన వెంకన్న తను సాగు చేసుకుంటున్న ఐదెకరాల భూమి తన పేరిట పట్టా చేయాలని రెవెన్యూ కార్యాలయం చుట్టూ కొన్నేళ్లుగా తిరుగుతున్నాడు.

అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ సీసాలో పెట్రోల్​తీసుకొచ్చి కుటుంబ సభ్యులతో కలిసి తహసీల్దార్ ఆఫీస్​ఎదుట బైఠాయించాడు. సమాచారం అందుకున్న నాగారం పీఎస్ కుటుంబం అక్కడకు చేరుకుని తహసీల్దార్ శ్రీకాంత్ తో మాట్లాడి సర్దిచెప్పడంతో ధర్నా విరమించాడు. ఈ విషయమై తహసీల్దార్​మాట్లాడుతూ వెంకన్న భూమి సమస్య గతంలోనే తమ దృష్టికి వచ్చిందన్నారు. అన్నదమ్ముల తగాదాలు ఉన్నందున డిప్యూటీ ఇన్స్​పెక్టర్ తో సర్వే చేయించామని అన్నారు. సర్వే రిపోర్ట్ రాగానే ఎవరి పేరు మీద భూమి ఎక్కువగా ఉందో చూసి  వెంకన్న పేరిట పట్టా చేస్తామన్నారు.

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు

Latest Updates